OTT లో స్ట్రీమ్ అవుతోన్న రాజ్ తరుణ్ నటించిన వెబ్ సిరీస్ Aha Naa Pellanta

హైలైట్స్

  • అహ నా పెళ్ళంట వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యువ కథానాయకుడు రాజ్ తరుణ్
  • జీ5 ఓటీటీ లో ప్రసారమవుతోన్న అహ నా పెళ్ళంట వెబ్ సిరీస్
  • ఈ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో పోషించిన రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్

యంగ్ హీరో రాజ్ తరుణ్ ఓటీటీ బాట పట్టాడు. ఇన్నాళ్ళు సినిమాలతో వెండితెర ప్రేక్షకులకు వినోదం పంచిన రాజ్ తరుణ్, ఇప్పుడు అహ నా పెళ్ళంట అనే వెబ్ సిరీస్ తో ఓటీటీ ఆడియన్స్ ని ఎంటర్టెయిన్ చేసేందుకు వచ్చేశాడు. రాజ్ తరుణ్ ప్రధాన పాత్ర పోషించిన అహ నా పెళ్ళంట వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5 లో స్ట్రీమ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి.

వెబ్‌సిరీస్ కథ

పెళ్ళిపీటలపై నుంచి పెళ్ళి కూతురు తన ఎక్స్-బాయ్‌ఫ్రెండ్ తో కలిసి లేచి పోతుంది. పాపం మరోవైపు పెళ్ళి కొడుకు, వధువు కోసం మండపంలో ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక చేసేదేముంది. తనను పెళ్ళి చేసుకోకుండా పారిపోయిన అమ్మాయిపై వరుడు రివెంజ్ తీర్చుకోవాలని ఫిక్స్ అయిపోవడంతో అసలు కథ షురూ అవుతుంది. ఇక తర్వాత ఏం జరగనుందో తెలియాలంటే మీరు జీ5 లో ప్రసారమయ్యే అహ నా పెళ్ళంట వెబ్ సిరీస్ చూడాల్సిందే.

ఎలా ఉంది?

అహ నా పెళ్ళంట సరదాగా సాగిపోయే ఒక రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్. మొదటి ఎపిసోడ్ ఆద్యంతం ఫన్నీగా సాగిపోతుంది. రెండు, మూడు ఎపిసోడ్స్ కాస్త స్లో అయినప్పటికీ తర్వాత ఎపిసోడ్స్ పుంజుకుంటాయి. రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి. లవ్, ఎమోషన్స్, కామెడీ అన్నీ బ్యాలన్స్ గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. వెబ్ సిరీస్ లా కాకుండా ఓ సినిమా చూస్తున్న అనుభూతి కల్గుతుంది.

ఎలా చేశారు?

నటీనటులు బాగా చేశారు. ఎవ్వరూ మైనస్ గా కనిపించలేదు. రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ తమ పాత్రల్లో జీవించారు. హర్షవర్ధన్ తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశారు. కామెడీ, ఎమోషన్ అన్ని సన్నివేశాలను రక్తిగట్టించారు. సిరీస్ కి ఆయన కూడా ఓ ప్లస్ పాయింట్. ఆమని, పోసాని కృష్ణమురళి కూడా బాగా చేశారు.

దర్శకుడు సంజీవ్ రెడ్డి తన దర్శకత్వ ప్రతిభతో మెప్పించాడు. కామెడీ, రొమాన్స్ తో పాటు అన్ని ఎమోషన్స్ ని బాగా హ్యాండిల్ చేశాడు. సిరీస్ ఆద్యాంతం బోర్ కొట్టకుండా బాగా తీసుకెళ్ళాడు. మధ్య మధ్యలో వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి.

అహ నా పెళ్ళంట వెబ్ సిరీస్ కి జుడా శాండీ సంగీతం అందించగా, పవన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సమకూర్చాడు. నగేశ్ బన్నెల్, ఆష్కర్ అలీ సినిమాటోగ్రఫర్స్ గా చేశారు. కథ, స్క్రీన్ ప్లే షేక్ దావూద్ అందించాడు. కళ్యాణ్ రాఘవ్ మాటలు రాశాడు. సూర్య రాహుల్ తమడా, సాయిదీప్ రెడ్డి బొర్రా ఈ వెబ్ సిరీస్ ని నిర్మించారు.

2022 నవంబర్ 17 నుంచి అహ నా పెళ్ళంట వెబ్ సిరీస్ జీ5 ఓటీటీ లో ప్రసారమవుతోంది. వినోదమంటేనే ఒత్తిడిని తగ్గించే మెడిసిన్. మరింకేంటి, అహ నా పెళ్ళంట వెబ్ సిరీస్ చూస్తూ కాసేపు హాయిగా నవ్వుకుని రిలాక్స్ అవ్వండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.