Redmi Note 11T 5G పై రూ.4,000 డిస్కౌంట్

హైలైట్స్

  • Redmi Note 11T 5G స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్, 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో లాంచ్ అయిన Redmi Note 11T 5G
  • అమెజాన్ లో Redmi Note 11T 5G పై 16 శాతం డిస్కౌంట్

Redmi Note 11T 5G స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ పై లభిస్తోంది. డిస్కౌంట్ ధరకి ఈ ఫోన్ ని మీ సొంతం చేసుకోవచ్చు. 5జీ కనెక్టివిటీ, 128జిబి స్టోరేజీ, 6జిబి ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 810 5జీ ప్రాసెసర్, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోన్ అమెజాన్ లో 16 శాతం డిస్కౌంట్ తో.. అంటే రూ.16,999 ధర వద్ద లభిస్తోంది. ఎక్స్‌చేంజ్ ఆఫర్స్, బ్యాంక్ డిస్కౌంట్స్ తో ఈ ఫోన్ ని మరింత తక్కువ ధరకి కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ మీకోసం Redmi Note 11T 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అందిస్తున్నాం. ఓసారి కన్నేయండి.

Redmi Note 11T 5G: డిస్కౌంట్స్ మరియు ఆఫర్స్

Redmi Note 11T 5G స్మార్ట్ ఫోన్ అమెజాన్ లో రూ.16,999 ధరతో లిస్ట్ అయి కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ డివైజ్ పై 16 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఫోన్ ధర రూ.4,000 తగ్గుతుంది. అమెజాన్ లో ఈఎంఐ పద్ధతిలో కూడా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. అప్పుడు మీరు నెలకు రూ.812 చెల్లించవలసి ఉంటుంది. కొన్ని బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా నో-కాస్ట్ ఈఎంఐ కూడా వర్తిస్తోంది. అప్పుడు మీరు రూ.765.89 ప్రతి నెల చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు మీ పాత ఫోన్ ని ఎక్స్‌చేంజ్ చేయడం ద్వారా Redmi Note 11T 5G ని మరింత తక్కువ ధరకి కొనుగోలు చేయవచ్చు. ఎక్స్‌చేంజ్ విలువ మీ పాత ఫోన్ కండీషన్ పై ఆధారపడి ఉంటుంది.

ఎన్నో బ్యాంకులు Redmi Note 11T 5G పై డిస్కౌంట్ అందిస్తున్నాయి. హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై రూ.1000 డిస్కౌంట్ లభిస్తోంది. అలాగే ఇండస్ ఇండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ పై 7.5 శాతం వరకు అంటే రూ.1500 దాకా డిస్కౌంట్ లభిస్తోంది. కొటక్ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్స్ లావాదేవీల ద్వారా 7.5 శాతం మేర డిస్కౌంట్ వస్తుంది. ఇంకా యస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్ ద్వారా రూ.2,000 వరకు డిస్కౌంట్ దొరుకుతుంది.

హెచ్డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్స్ పై రూ.250 వరకు క్యాష్‌బ్యాక్ కూడా అందుబాటులో ఉంది. యూజర్లు కనుక అమెజాన్ పే యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ నెరిపితే వారు రూ.50 క్యాష్‌బ్యాక్ పొందుతారు.

Redmi Note 11T 5G స్పెసిఫికేషన్స్

Redmi Note 11T 5G స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో 6.6-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. ఇది 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్ ని కలిగి ఉంది. అలాగే ఇందులో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ని అందించారు. Redmi Note 11T 5G ఆండ్రాయిడ్ 11 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 12.5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Redmi Note 11T 5G స్మార్ట్ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ని కలిగి ఉంది. ఇందులో 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. భద్రత కోసం ఈ ఫోన్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. యాక్సలరోమీటర్, గైరోస్కోప్, కంపాస్ ఈ ఫోన్ లో ఉన్నాయి. Redmi Note 11T 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.