హైలైట్స్
- చైనా సామాజిక మాధ్యమం Weibo పై కనిపించిన iQOO Neo 7 SE ప్రోమో పోస్టర్
- iQOO Neo 7 SE ఒక మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ గా ఎంట్రీ ఇవ్వనుందని అంచనా
- మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్న iQOO Neo 7 SE
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీదారు అయిన iQOO కంపెనీ త్వరలో ఒక మిడ్ రేంజ్ ప్రీమియమ్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Neo సిరీస్ లో రానున్న ఈ ఫోన్ పేరు iQOO Neo 7 SE. చైనీస్ సోషల్ మీడియా వేదిక అయిన వీబో పై iQOO Neo 7 SE యొక్క ప్రోమో ఇమేజ్ కనిపించింది. దీంతో iQOO Neo 7 SE యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. కొత్త జనరేషన్ Neo లైనప్ లో iQOO Neo 7 SE ఎంట్రీ లెవెల్ ఫోన్ గా రానుందని అందరూ భావిస్తున్నారు.
రివీల్ అయిన iQOO Neo 7 SE పోస్టర్
iQOO Neo 7 SE స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ తో లాంచ్ అవుతుందని ఓ పోస్టర్ విడుదలైంది. అయిన లాంచ్ తేదీ మాత్రం వెల్లడి కాలేదు. డైమెన్సిటీ 8200 చిప్సెట్ టీఎస్ఎంసీ 4 నానో మీటర్ ఫాబ్రికేషన్ ప్రాసెస్ పై తయారైంది. ఈ చిప్ డైమెన్సిటీ 8100 కి సక్సెసర్ గా చెప్పబడుతోంది. క్వాల్కమ్ యొక్క స్నాప్ డ్రాగన్ 7 జెన్ 2 ప్రాసెసర్ తో ఇది పోటీ పడనుంది.
పెర్ఫామెన్స్ విషయంలో మీడియాటెక్ తయారు చేసిన డైమెన్సిటీ 8100 చిప్సెట్ తో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 పోటీ పడలేదు. దీంతో ఈసారి మీడియాటెక్ తీసుకొస్తున్న సబ్-ఫ్లాగ్షిప్ చిప్ తో క్వాల్కమ్ ఏ మేరకు పోటీ ఇస్తుందో చూడాలి.
iQOO Neo 7 SE యొక్క ఇతర స్పెసిఫికేషన్స్ ఎలా ఉండనున్నాయో చూద్దాం. iQOO Neo 7 SE స్మార్ట్ ఫోన్ యొక్క లీకైన పోస్టర్ ప్రకారం, ఈ ఫోన్ 6.78-ఇంచ్ ఈ5 అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఇంకా iQOO Neo 7 SE లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు సమాచారం. కెమెరా విభాగానికి వస్తే పెద్దగా సమాచారం ఏమీ లేదు. కానీ, మెయిన్ సెన్సర్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
iQOO Neo 7 SE స్మార్ట్ ఫోన్ మొత్తం మూడు కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. కచ్చితమైన కలర్ వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. అయితే వీటిలో లెదర్ టెక్చర్డ్ బ్యాక్ ప్యానెల్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఇండియా లాంచ్ కి సంబంధించిన సమాచారం ఏమీ లేదు. చైనాలో లాంచ్ అయ్యాక ఇతర మార్కెట్స్ లోకి ఈ డివైజ్ ప్రవేశించే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో ఐకూ నుంచి ప్రోమో టీజర్స్ రూపంలో మరింత సమాచారం తెలియనుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.













