BIS వెబ్‌సైట్ పై కనిపించిన iQOO Neo 7 5G; 120Hz రిఫ్రెష్ రేట్, 12GB ర్యామ్ తో వస్తున్న డివైజ్

హైలైట్స్

  • 2023 జనవరిలో లాంచ్ కానున్న iQOO Neo 7 5G స్మార్ట్ ఫోన్
  • BIS వెబ్‌సైట్ పై I12214 అనే మోడల్ నంబర్ తో కనిపించిన iQOO Neo 7 5G
  • 12జిబి ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో రానున్న iQOO Neo 7 5G

వివో సబ్-బ్రాండ్ అయిన ఐకూ రీసెంట్ గా చైనాలో ఐకూ 11 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. ఈ ఫోన్లతో పాటు iQOO Neo 7 SE అనే ఫోన్ ని కూడా లాంచ్ చేసింది. ఇప్పుడు ఐకూ సంస్థ iQOO Neo 7 5G అనే ఫోన్ ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

అయితే తాజాగా iQOO Neo 7 5G బీఐఎస్ వెబ్ సైట్ లో ఐ12214 అనే మోడల్ నంబర్ తో కనిపించింది. దీంతో ఈ ఫోన్ భారత్ లో త్వరలోనే లాంచ్ కానుందని స్పష్టమైంది. లీక్‌స్టర్ పారస్ గుగ్లాని iQOO Neo 7 5G యొక్క లాంచ్ టైమ్ లైన్, ధర శ్రేణి, స్పెసిఫికేషన్స్ ని ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఈ డివైజ్ 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 12జిబి ర్యామ్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఓసారి iQOO Neo 7 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.

iQOO Neo 7 5G ఇండియా లాంచ్ , ధర (అంచనా)

Pricebaba వెబ్ సైట్ iQOO Neo 7 5G యొక్క బీఐఎస్ లిస్టింగ్ ని వెలికితీసింది. టిప్‌స్టర్ ప్రకారం, iQOO Neo 7 5G ఫోన్ 2023 జనవరిలో లాంచ్ అవుతుందని అంచనా. భారత్ లో ఈ ఫోన్ ధర రూ.30,000 గా ఉండే అవకాశం ఉంది.

iQOO Neo 7 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

iQOO Neo 7 5G స్మార్ట్ ఫోన్ 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 12జిబి ర్యామ్ తో వస్తోంది. ఈ డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ లేదా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ తో రానుంది. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

iQOO Neo 7 5G యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. iQOO Neo 7 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. iQOO Neo 7 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్, వై-ఫై తదితర బేసిక్ కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉంటాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous article12GB ర్యామ్, Dimensity 9000+ చిప్సెట్ తో వస్తోన్న OPPO Find N2 Flip
Next article6.8-inch డిస్ప్లే, 8 Gen 2 ప్రాసెసర్ తో వస్తున్న Samsung Galaxy S23 Ultra
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.