హైలైట్స్
- ఎన్నో ఉత్తమమైన ప్రీపెయిడ్ ప్లాన్స్ ని అందిస్తోన్న ఎయిర్టెల్
- ఎక్కువ రోజుల వ్యాలిడిటీ, డెయిలీ డేటా, డెయిలీ ఎస్ఎంఎస్ లు ఇతర ప్రయోజనాలను అందిస్తోన్న రూ.779 ప్లాన్
- 90 రోజుల వ్యాలిడిటీ, ప్రతిరోజు 1.5జిబి డేటా, అపరిమిత కాల్స్ మరెన్నో ప్రయోజనాలను అందించనున్న ప్లాన్
భారతదేశంలోని టాప్ టెలీకామ్ కంపెనీల్లో ఎయిర్టెల్ ఒకటి. ప్రస్తుతం టెలీకామ్ మార్కెట్ లో జియో మరియు ఎయిర్టెల్ కి నడుమ ప్రధానంగా పోటీ ఉంది. ఇక వొడాఫోన్ ఐడియా మూడో స్థానంలో కొనసాగుతోంది. ప్రభుత్వరంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. 4జీ, 5జీ సేవలను అందించేందుకు బీఎస్ఎన్ఎల్ సిద్ధమవుతోంది. అయితే ఎయిర్టెల్, జియో ఇప్పటికే 5జీ సేవలను అందిస్తున్నాయి.
టెలీకామ్ సంస్థలు వినియోగదారుడిని ఆకర్షించేందుకు వివిధ రీచార్జ్ ప్లాన్స్ ని ఆఫర్ చేస్తున్నాయి. ఇప్పుడు మనం ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.779 ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఈ ప్లాన్ ద్వారా యూజర్లకు 90 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత కాల్స్, డెయిలీ ఎస్ఎంఎస్, డేటా వంటి ప్రయోజనాలు లభిస్తాయి. ఓసారి రూ.779 ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. పదండి.
Airtel రూ.779 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు
ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.779 రీచార్జ్ ప్లాన్ తో యూజర్ కి ఎన్నో బెనిఫిట్స్ లభిస్తాయి. ఈ ప్లాన్ తో ప్రతిరోజు 1.5 జిబి డేటా, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లు, అపరిమిత కాలింగ్ సౌకర్యం వంటి ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్ 90 రోజుల పాట చెల్లుబాటు అవుతుంది. అంతేకాదండోయ్, ఈ ప్లాన్ తో అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
అదనపు ప్రయోజనాలు
రూ.779 రీచార్జ్ ప్లాన్ తో 90 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత కాలింగ్, ఎస్ఎంఎస్, డెయిలీ డేటా వంటి బెనిఫిట్స్ కాకుండా ఇంకా 3 నెలల పాటు అపోలో 24/7 సర్కిల్ సేవలు ఉచితంగా లభిస్తాయి. ఇంకా ఫాస్టాగ్ పై రూ.100 క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. ఇంకా ఫ్రీ హలో ట్యూన్స్, ఫ్రీ వింక్ మ్యూజిక్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.
ఇక ఈ ప్లాన్ తో వచ్చే డెయిలీ 100 ఎస్ఎంఎస్ లు వాడుకున్నాక, మీరు పంపే ప్రతి లోకల్ ఎస్ఎంఎస్ కి రూ.1 ఖర్చవుతుంది. ఎస్టీడీ ఎస్ఎంఎస్ కి రూ.1.50 పైసలు ఖర్చవుతుంది. డేటా స్పీడ్ విషయానికి వస్తే, డెయిలీ పరిమితి దాటాక డేటా వేగం 64కేబీపీఎస్ కి పడిపోతుంది.
Airtel Rs 779 Plan Benefits
- 90 రోజుల వ్యాలిడిటీ
- 1.5జిబి డెయిలీ డేటా
- 100 డెయిలీ ఎస్ఎంఎస్
- అపరిమిత లోకల్ మరియు ఎస్టీడీ కాలింగ్
- అపోలో 24/7 సర్కిల్ సేవలు
- ఉచిత వింక్ మ్యూజిక్
- ఉచిత హలో ట్యూన్స్
- ఫాస్టాగ్ పై రూ.100 క్యాష్‌బ్యాక్
మరి ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.779 ప్లాన్ ఎవరికి సరిపోతుందో చూద్దాం. ఎవరైతే మూడు నెలల వ్యాలిడిటీ మరియు డెయిలీ డేటా, ఎస్ఎంఎస్, అన్లిమిటెడ్ కాలింగ్ వంటి బెనిఫిట్స్ కావాలని కోరుకుంటారో వారు ఈ ప్లాన్ ని రీచార్జ్ చేసుకోవచ్చు. ఓసారి ప్లాన్ ప్రయోజనాలను అర్థం చేసుకుని రీచార్జ్ చేసుకోండి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












