హైలైట్స్
- రివీల్ అయిన Vivo S16, Vivo S16e స్పెసిఫికేషన్స్
- ఈ నెలలో లాంచ్ కానున్న Vivo S16, Vivo S16e డివైజెస్
- స్నాప్ డ్రాగన్ 870 చిప్ తో వస్తోన్న Vivo S16, ఎగ్జినోస్ 1080 చిప్ తో వస్తోన్న Vivo S16e
ఈ ఏడాది మే నెలలో చైనాలో Vivo S15, Vivo S15 Pro లాంచ్ అయ్యాయి. ఇప్పుడు 7 నెలల తర్వాత, వివో వీటికి సక్సెసర్స్ ని తీసుకొచ్చేందుకు రెడీ అయ్యింది. కొన్ని రోజుల నుంచి Vivo S16, Vivo S16 Pro ఫోన్లు వార్తల్లో నిలుస్తూ వస్తున్నాయి. ఈవారంలోనే ఈ రెండు ఫోన్లు కూడా గీక్ బెంచ్ పై దర్శనమిచ్చాయి. అయితే ఇప్పుడు వీటికి తోడు Vivo S16e మోడల్ కూడా ఉండనున్నట్లు తెలిసింది.
అయితే ఈ Vivo S16 సిరీస్ ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా తెలియదు. ఇండస్ట్రీ వార్తల ప్రకారం, ఈ నెలలోనే చైనాలో ఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది. ఇక వివో ఎస్15 ని వివో భారత్ లో లాంచ్ చేయలేదు. కావున, ఎస్16 సిరీస్ కూడా భారతదేశంలో లాంచ్ అవుతుందని మేం భావించడం లేదు. రానున్న రోజుల్లో ఏం జరగనుందో చూద్దాం. ఇప్పుడైతే, Vivo S16, Vivo S16e స్మార్ట్ ఫోన్స్ యొక్క స్పెసిఫికేషన్స్ పై ఓ కన్నేద్దాం పదండి.
రివీల్ అయిన Vivo S16, Vivo S16e స్పెసిఫికేషన్స్
టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ చెబుతున్న దాన్ని బట్టి, Vivo S16 స్మార్ట్ ఫోన్ 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 870 చిప్, 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీతో రానుంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 3.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
Vivo S16 లో 64ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ, 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉంటాయి. ఈ డివైజ్ 182 గ్రాముల బరువు, 7.4 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది. ఇంకా ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఎన్ఎఫ్‌సీ కూడా ఉంటాయి.
Vivo S16e స్పెసిఫికేషన్స్
Vivo S16e లో 6.62-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్ ఉంటాయి. వివో ఈసారి ఈ ఫోన్ లో శాంసంగ్ యొక్క ఎగ్జినోస్ 1080 చిప్సెట్ వాడుతోంది. ఈ డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీతో రానుంది.
Vivo S16e లో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో షూటర్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుంది.
పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ 7.8 మిల్లీ మీటర్ల మందం, 188 గ్రాముల బరువు ఉంటుంది. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఎన్ఎఫ్‌సీ కూడా ఈ ఫోన్ లో ఉంటాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












