హైలైట్స్
- దిగువ బడ్జెట్ శ్రేణి కొనుగోలుదారుల కోసం వస్తోన్న Samsung Galaxy A04, Galaxy A04e
- ఈవారంలోనే భారత్ లో ఎంట్రీ ఇవ్వబోతున్న Samsung Galaxy A04, Galaxy A04e
- ఈ రెండు శాంసంగ్ ఫోన్ల ధర రూ.10 వేల లోపే ఉండే అవకాశం
శాంసంగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ వచ్చేస్తుంది. త్వరలోనే కంపెనీ నుంచి రెండు చవకైన ఫోన్లు లాంచ్ కాబోతున్నాయి. అవి: Samsung Galaxy A04, Galaxy A04e. న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ కథనం ప్రకారం, ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ భారత మార్కెట్ లో ఈ వారంలోనే విడుదలవ్వనున్నాయిని తెలుస్తోంది. వీటి ధర రూ.10,000 కంటే తక్కువ ఉండే అవకాశం ఉంది. ఈలోపు ఓసారి Samsung Galaxy A04, Galaxy A04e డివైజెస్ యొక్క స్పెసిఫికేషన్స్ పై కన్నేద్దాం పదండి.
Samsung Galaxy A04 స్పెసిఫికేషన్స్ (అంచనా)

Samsung Galaxy A04e స్పెసిఫికేషన్స్ (అంచనా)
Samsung Galaxy A04e స్మార్ట్ ఫోన్ 6.5-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇందులో మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్ వాడే అవకాశం ఉంది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇకపోతే 4జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో ఈ ఫోన్ లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే అవకాశం ఉంది. అలాగే ఈ ఫోన్ ర్యామ్ ప్లస్ టెక్నాలజీతో వస్తోంది. దీంతో వర్చువల్ ర్యామ్ ద్వారా 8జిబి వరకు పెంచుకోవచ్చు.
Samsung Galaxy A04e డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్, వన్యూఐ కోర్ 4.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సీ వంటి బేసిక్ కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.
Samsung Galaxy A04e కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, 2 ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. Samsung Galaxy A04e 164.2 మిల్లీ మీటర్ల పొడవు, 75.9 మిల్లీ మీటర్ల వెడల్పు, 9.1 మిల్లీ మీటర్ల మందం, 188 గ్రాముల బరువు ఉంటుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.













