డిసెంబర్ 29 న లాంచ్ అవుతోన్న iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్

హైలైట్స్

  • వివో సబ్-బ్రాండ్ ఐకూ నుంచి త్వరలో లాంచ్ కానున్న iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో లాంచ్ కానున్న iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్
  • డిసెంబర్ 29 న చైనాలో లాంచ్ కానున్న iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్

వివో సబ్-బ్రాండ్ అయిన ఐకూ నుంచి త్వరలో iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది. టిప్‌స్టర్ ముకుల్ శర్మ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో లాంచ్ అవుతోంది. ఈ విషయం పోస్టర్ ద్వారా కన్ఫర్మ్ అయ్యింది. సరే ఓసారి iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ యొక్క లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్ ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.

iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ లాంచ్ తేదీ

రివీల్ అయిన పోస్టర్ ని బట్టి, iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ చైనాలో డిసెంబర్ 29 న లాంచ్ అవుతోంది. అయితే, గ్లోబల్ మరియు ఇండియా లాంచ్ కి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన వెలువడలేదు.

iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ స్పెసిఫికేషన్స్

iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తోంది. గత రిపోర్ట్ ప్రకారం, ఈ చిప్ 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ తో పెయిర్ కాబడిందని తెలిసింది. ఇంకా మిగతా స్టోరేజీ ఆప్షన్స్ కూడా ఉండనున్నాయి.

ఇప్పటివరకు బయటకు వచ్చిన స్పెసిఫికేషన్స్ ని బట్టి, iQOO Neo 7 లో అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. సెల్ఫీ కెమెరా కోసం పంచ్-హోల్ కటౌట్ ఉండనుందని తెలుస్తోంది.

iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ యొక్క కెమెరా విభాగం ఎలా ఉండనుందో చూద్దాం. ఈ డివైజ్ లో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తోంది. అలాగే పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కి సపోర్ట్ చేస్తుంది. iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఇంకా ఐఆర్ బ్లాస్టర్ కూడా ఈ ఫోన్ లో ఉంటుంది.

iQOO Neo 7 Racing Edition Specs

  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్
  • అమోలెడ్ డిస్ప్లే
  • ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్
  • 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్
  • ఒరిజిన్ఓఎస్ 3 కస్టమ్ స్కిన్
  • ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleరూ.749 ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్ చేసిన Jio
Next article50ఎంపి సెల్ఫీ కెమెరా, 64ఎంపి మెయిన్ కెమెరాతో లాంచైన Vivo S16 5G
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.