హైలైట్స్
- ప్రస్తుతం Tata Punch EV పై పని చేస్తున్న Tata మోటార్స్
- అత్యధిక రేంజ్, అద్భుతమైన ఫీచర్లతో రానున్న Tata Punch EV
- 2023 లో Tata Punch EV లాంచ్ అయ్యే అవకాశం
Tata Punch EV పై వస్తోన్న రకరకాల కథనాలకు ఫుల్‌స్టాప్ పెడుతూ, తాజాగా టాటా మోటర్స్ తన నిర్ణయాన్ని ప్రకటించింది. Tata Punch EV ని తీసుకురాబోతున్నట్లు స్పష్టం చేసింది. దీంతో భారతదేశపు తొలి మైక్రో-ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ కారుగా Tata Punch EV నిలవనుంది. టాటా ప్యాసెంజర్ మరియు ఎలక్ట్రిక్ మొబిలిటీ సీఈవో వివేక్ శ్రీవత్స మాట్లాడుతూ.. Tata Punch EV ని త్వరలోనే లాంచ్ చేస్తామని అన్నారు. ప్రస్తుతం టాటా చేతిలో 4 ఈవీ మోడల్స్ ఉన్నాయి. ఇవి ఇప్పటికే మార్కెట్ లో లాంచ్ అయ్యాయి. అవి: టాటా టియాగో ఈవీ, టాటా టిగోర్ ఈవీ, టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్, టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్.
త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Tata Punch EV
Tata Punch EV ప్రాజెక్ట్‌కి టాటా మోటర్స్ పచ్చ జెండా ఊపింది. ఈ కారు టాటా పంచ్ ఐసీఈ మోడల్ ఆధారంగా రూపొందనుంది. Tata Punch EV భారతదేశపు తొలి మైక్రో-ఎస్‌యూవీ గా నిలవనుంది. Tata Punch EV ధర టియాగో ఈవీ మరియు టిగోర్ ఈవీ ధరలకు మధ్యలో ఉండనుంది.
త్వరలోనే Tata Punch EV ని లాంచ్ చేయబోతున్నట్లు టాటా ప్యాసెంజర్ మరియు ఎలక్ట్రిక్ మొబిలిటీ టాప్ ఎగ్జిక్యూటివ్ వివేక్ తెలిపినట్లు మీడియా రిపోర్ట్స్ వెల్లడించాయి. అయితే, కంపెనీ ఇంకా ఈ కారు యొక్క అధికార లాంచ్ తేదీని వెల్లడించలేదు. కానీ, Tata Punch EV 2023 లో ద్వితీయార్థంలో లాంచ్ కానుందని తెలుస్తోంది.
Tata Punch కారు టాటా యొక్క ఆల్ఫా ప్లాట్ఫామ్ పై తయారు కానుంది. దీనిపై ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ నిర్మితం కానుంది. Tata Punch EV హై-వోల్టేజీ జిప్ట్రాన్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ ని కూడా వినియోగించుకోనుంది. టాటా టియాగో, టాటా టిగోర్ మరియు టాటా నెక్సాన్ లలో ఈ పవర్‌ట్రెయిన్ ని వాడారు.
Tata Punch ఎలక్ట్రిక్ కారు ధర రూ.10 లక్షల నుంచి రూ.13 లక్షల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. పవర్‌ట్రెయిన్ ఆప్షన్ ని బట్టి ధర అనేది మారుతుంది. టాటా టియాగో ఈవీ కి ఎంట్రీ లెవెల్ టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్ కి నడుమ Tata Punch EV ఉండనుంది. Tata Punch EV, Citroen eC3 మైక్రో-ఎస్‌యూవీ కి సవాలు విసరనుంది.
భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. సంప్రదాయ ఇంధనాల ధరలు ఆకాశానికి చేరడంతో సామాన్యుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. దీంతో జనాలు ఎలక్ట్రిక్ కారు లేదా ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఎలక్ట్రిక్ స్కూటర్లు విభిన్న ధరల శ్రేణిలో లభ్యమవుతున్నప్పటికీ, ఎలక్ట్రిక్ కార్ల పరిస్థితి అలా లేదు. విద్యుత్ కార్ల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలని కోరుకుందాం.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












