100W ఫాస్ట్ చార్జింగ్, Snapdragon 8+ Gen 1 చిప్ తో వస్తోన్న OnePlus Ace 2

హైలైట్స్

  • త్వరలో చైనాలో లాంచ్ కానున్న OnePlus Ace 2 స్మార్ట్ ఫోన్, తాజాగా లీకైన స్పెసిఫికేషన్స్
  • 1.5 కే కర్వ్డ్ డిస్ప్లే, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న OnePlus Ace 2 హ్యాండ్సెట్
  • గ్లోబల్ మార్కెట్స్ లో OnePlus 11R పేరుతో లాంచ్ కానున్న OnePlus Ace 2

ఈ ఏడాది మొదట్లో వన్‌ప్లస్ సంస్థ OnePlus Ace సిరీస్ ని చైనాలో లాంచ్ చేసింది. ఇప్పుడు ఏస్ లైనప్ లో ప్రస్తుతం బ్రాండ్ వద్ద 3 ఫోన్లు ఉన్నాయి. అవి: OnePlus Ace, OnePlus Ace Racing Edition, OnePlus Ace Pro. ఇప్పుడు కంపెనీ మరొక ఏస్ సిరీస్ ఫోన్ – OnePlus Ace 2 పై పని చేస్తున్నట్లు చైనీస్ సామాజిక మాధ్యమం వీబో ద్వారా తెలిసింది. అలాగే ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ అయ్యాయి.

టిప్‌స్టర్ చెబుతున్న దాన్ని బట్టి, OnePlus Ace 2 డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ తో వస్తోంది. ఈ ఫోన్ కర్వ్డ్ డిస్ప్లేని కలిగి ఉంటుంది. అలాగే OnePlus Ace 2 ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

OnePlus Ace 2 స్పెసిఫికేషన్స్ (లీక్డ్)

OnePlus Ace 2 స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్ తో వస్తోంది. ఇది 4 నానో మీటర్ ప్రాసెస్ పై తయారైన చిప్. వన్ ప్లస్ ఏస్ ప్రో లో కూడా ఇదే చిప్ వాడారు. గ్లోబల్ మార్కెట్స్ లో ఏస్ ప్రో, OnePlus 10T పేరుతో లాంచ్ అయ్యింది. ఇకపోతే OnePlus Ace 2 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోంది. OnePlus Ace 2 కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేతో రానుంది. ఇది 1.5 కే రెజుల్యూషన్ ని కల్గి ఉంటుంది.

ఇప్పుడు OnePlus Ace 2 యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. OnePlus Ace 2 లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉండే అవకాశం ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనుంది. ఇకపోతే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ లో ఉంటుందని సమాచారం. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ తో వస్తున్నట్లు అంచనా వేస్తున్నారు.

స్పెసిఫికేషన్స్ ని బట్టి చూస్తే, OnePlus Ace 2 ని గ్లోబల్ మార్కెట్స్ లో OnePlus 11R గా రీబ్రాండ్ చేసి లాంచ్ చేస్తారని తెలుస్తోంది.

ఓసారి గత మోడల్ OnePlus Ace తో పోల్చితే OnePlus Ace 2 కెమెరా విభాగంలో మాత్రం అప్‌గ్రేడ్ అయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే OnePlus Ace లో సోని ఐఎంఎక్స్766 ప్రైమరీ సెన్సర్ వాడారు. OnePlus Ace 2 సోని ఐఎంఎక్స్890 లెన్స్ తో వస్తోంది. రానున్న రోజుల్లో OnePlus Ace 2 కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.