66W ఫాస్ట్ చార్జింగ్, 120Hz డిస్ప్లేతో లాంచైన HONOR 80 GT

హైలైట్స్

  • చైనాలో లాంచైన HONOR 80 GT స్మార్ట్ ఫోన్
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్, 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 4800 ఎంఏహెచ్ బ్యాటరీ, 54ఎంపి కెమెరా తో లాంచైన హ్యాండ్సెట్
  • HONOR 80 GT ధర 3,299 యువాన్లు (సుమారు రూ.39,200)

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ తాజాగా చైనాలో HONOR 80 GT అనే స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ హ్యాండ్సెట్ ప్రధానంగా గేమింగ్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ తీసుకొచ్చారు. ఈ ఫోన్ తీరుతెన్నులు ఎలా ఉన్నాయో చూద్దాం. HONOR 80 GT లో సెంటర్ పంచ్-హోల్ కటౌట్ ఉంటుంది. ఇది 4386ఎంఎం2 బయోనిక్ వీసీ, అల్ట్రా-డెన్స్ కాపర్ మెష్ ఒవెన్ తో వచ్చింది. అలాగే ఏఐ ఇంటెలిజెంట్ థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్, రెక్టాంగ్యులర్ రియర్ కెమెరా మాడ్యూల్, బ్యాక్ ప్యానెల్ పై ప్యాటెర్న్ డిజైన్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

HONOR 80 GT ఇండెపెండెంట్ డిస్ప్లే చిప్ కలిగి ఉండటం వల్లన గేమ్ ఫ్రేమ్ రేట్స్ ని 100 శాతం మేర పెంచేందుకు దోహదం చేస్తుంది. ఇంకా పవర్ కన్సమ్షన్ ని 25 శాతం వరకు తగ్గిస్తుంది.

HONOR 80 GT స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 4800 ఎంఏహెచ్ బ్యాటరీ, 54ఎంపి ప్రైమరీ కెమెరా, ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చింది. ఇప్పుడు HONOR 80 GT యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం.

HONOR 80 GT ధర

HONOR 80 GT 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను 3,299 యువాన్లు (సుమారు రూ.39,200) గా నిర్ణయించారు. 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ యూనిట్ ధర 3,599 యువాన్లు (సుమారు రూ.42,800) గా ఉంది. ఈ డివైజ్ మీటియోర్ బ్లూ, వైట్ మరియు ఇంటర్‌స్టెల్లార్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. 2023 జనవరి 1 నుంచి చైనాలో ఈ ఫోన్ అమ్మకాలు మొదలుకానున్నాయి.

HONOR 80 GT స్పెసిఫికేషన్స్

HONOR 80 GT స్మార్ట్ ఫోన్ లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ హై-ఫ్రీక్వెన్సీ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, 10-బిట్ 1.07 బిలియన్ కలర్స్ ఉన్నాయి.

HONOR 80 GT ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, అడ్రెనో జీపీయూ గ్రాఫిక్స్, 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీతో వచ్చింది. HONOR 80 GT డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ యూఐ 7.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

HONOR 80 GT యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. HONOR 80 GT లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 54ఎంపి సోని ఐఎంఎక్స్800 ప్రైమరీ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

HONOR 80 GT లో పవర్ బ్యాకప్ కోసం 4800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఈ ఫోన్ స్టీరియో స్పీకర్స్ తో వచ్చింది.

HONOR 80 GT Specs

  • 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే
  • 120Hz రిఫ్రెష్ రేట్
  • Snapdragon 8+ Gen 1 చిప్సెట్
  • 54mp Sony IMX800 మెయిన్ కెమెరా + 8mp వైడ్ యాంగిల్ + 2mp మ్యాక్రో
  • 16mp ఫ్రంట్ కెమెరా
  • 4800mAh బ్యాటరీ, 66W ఫాస్ట్ చార్జింగ్
  • 16GB LPDDR5 ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీ
  • Android 12 OS

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.