హైలైట్స్
- చైనాలో నేడు ఎంట్రీ ఇచ్చిన Redmi K60 సిరీస్
- లైనప్ లో వచ్చిన మోడల్స్: Redmi K60, Redmi K60 Pro, Redmi K60e
- వేరియంట్ ని బట్టి ఈ ఫోన్ల ధరలు రూ.24,000 నుంచి రూ.40,000 మధ్యలో ఉంటాయని అంచనా
- 2కే డిస్ప్లే, 16జిబి ర్యామ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 12-బిట్ డిస్ప్లేతో లాంచైన REDMI K60 PRO

Redmi లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. నేడు చైనాలో Redmi K60 సిరీస్ లాంచైంది. ఈ సిరీస్ లో మొత్తం 3 మోడల్స్ వచ్చాయి. అందులో Redmi K60, Redmi K60 Pro, Redmi K60e ఉన్నాయి. మిడ్ రేంజ్ నుంచి ప్రీమియమ్ మిడ్ రేంజ్ వరకు ఈ ఫోన్లు వినియోగదారుల అవసరాలను తీర్చనున్నాయి. వారి అంచనాలను ఈ ఫోన్లు అందుకుంటాయో లేదో తెలియాలంటే ఈ ఫోన్లు అందించే స్పెసిఫికేషన్స్ మనకు తెలియాలి.
Redmi K60 Pro స్మార్ట్ ఫోన్ 16GB ర్యామ్, 120W ఫాస్ట్ చార్జింగ్, 2K డిస్ప్లేతో వచ్చింది. ఈ డివైజ్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో వాడారు. ఈ ఫోన్ లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి సోని ఐఎంఎక్స్800 మెయిన్ లెన్స్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. Redmi K60 Pro ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ని ఇక్కడ తెలుసుకుందాం.
Redmi K60 Pro ధర
Redmi K60 Pro స్మార్ట్ ఫోన్ చైనాలో 5 వేరియంట్లలో లాంచైంది. ఈ వేరియంట్స్ 8జిబి/12జిబి/16జిబి ర్యామ్ మరియు 128జిబి/256జిబి/512జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభించనుంది. వీటి ధరలెలా ఉన్నాయో చూద్దాం.
- Redmi K60 Pro 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ = 3299 యువాన్లు (సుమారు రూ.39,000)
- Redmi K60 Pro 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ = 3599 యువాన్లు (సుమారు రూ.42,800)
- Redmi K60 Pro 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ = 4299 యువాన్లు (సుమారు రూ.51,000)
- Redmi K60 Pro 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ = 4599 యువాన్లు (రూ.54,700)
Redmi K60 PRO స్పెసిఫికేషన్స్
Redmi K60 Pro స్మార్ట్ ఫోన్ 6.67-ఇంచ్ 2కే డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో లాంచైంది. ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 30 వాట్ వైర్లెస్ చార్జింగ్ సౌకర్యం ఈ ఫోన్ లో ఉంటుంది.
Redmi K60 Pro కెమెరా విభాగం ఎలా ఉందో చూద్దాం. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్800 ప్రైమరీ లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











