రూ.25, రూ.55 ప్లాన్స్ తీసుకొచ్చిన Vodafone Idea

హైలైట్స్

  • రూ.25, రూ.55 ప్లాన్స్ ని పరిచయం చేసిన వొడాఫోన్ ఐడియా కంపెనీ
  • యాక్టివ్ బేస్ ప్లాన్ పై ఈ రీచార్జ్ ప్లాన్స్ ని వాడుకునే అవకాశం
  • రెండు ప్లాన్స్ లో 3.3 జిబి వరకు అందుబాటులో ఉండనున్న డేటా

భారతదేశంలో అగ్రశ్రేణి టెలీకామ్ కంపెనీలుగా ఎయిర్టెల్, జియో సంస్థలు కొనసాగుతున్నాయి. వీటి తర్వాత వొడాఫోన్ ఐడియా మూడో స్థానంలో ఉంది. ఎయిర్టెల్, జియో కంపెనీలకు గట్టి పోటి ఇచ్చేందుకు వొడాఫోన్ ఐడియా వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ ని తీసుకొస్తోంది. ఇప్పటికే ఈ కంపెనీ వద్ద ఎన్నో ఆకర్షణీయమైన ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉన్నాయి. తాజాగా ఈ సంస్థ మరొక రెండు ప్లాన్స్ ని తీసుకొచ్చింది.

వొడాఫోన్ ఐడియా సంస్థ తీసుకొచ్చిన రూ.25, రూ.55 ప్లాన్స్ కొత్త సంవత్సరానికి ముందే అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్లాన్స్ అత్యంత చవకైనవి కావున, ఇప్పటికే ఈ తరహా ప్లాన్స్ అందిస్తోన్న జియో కి కష్టాలు మొదలైనట్లేనని చెప్పాలి. ఇక ఈ రెండు ప్లాన్స్ ద్వారా కస్టమర్లకు 4జీ డేటా లభిస్తుంది. సరే, ఓసారి ఈ ప్లాన్స్ యొక్క పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి.

Vodafone Idea డేటా ప్లాన్స్

1. వొడాఫోన్ ఐడియా రూ.25 డేటా ప్లాన్: వొడాఫోన్ ప్రీపెయిడ్ యూజర్లకు ఈ ప్లాన్ రీచార్జ్ చేయడం ద్వారా 1.1 జిబి డేటా ఒకరోజుకి లభిస్తుంది. ఇంకా ఈ డేటాకి ఒకరోజు కాలపరిమితి ఉంటుంది. అలాగే 7 రోజుల పాటు ఉచిత మ్యూజిక్ ని ఎంజాయ్ చేయవచ్చు.

2. వొడాఫోన్ ఐడియా రూ.55 ప్లాన్: వొడాఫోన్ ఐడియా తీసుకొచ్చిన రూ.55 ప్లాన్ ద్వారా కస్టమర్లకు 3.3 జిబి డేటా లభిస్తుంది. అలాగే ఇది 7 రోజుల పాటు ఈ డేటా చెల్లుబాటు అవుతుంది. ఇంకా ఈ ప్లాన్ తో పాటు 1 నెల పాటు యాడ్ ఫ్రీ మ్యూజిక్ ఉచితంగా లభిస్తుంది.

ఈ రెండు ప్లాన్స్ అనేవి తక్కువ ధరలో డేటా కావాలని భావించే వారి కోసం ఉద్దేశించినవి. అలాగే ఈ ప్లాన్స్ ద్వారా డేటా తో పాటు ఉచిత యాడ్ ఫ్రీ మ్యూజిక్ కూడా లభిస్తుంది. అంటే డేటా తో హ్యాపీగా మ్యూజిక్ ని ఎంజాయ్ చేయవచ్చు. రెండు యొక్క ప్లాన్స్ వివరాలను పూర్తిగా చదివి మీకు సరిపోయే ప్లాన్ ఏదో ఎంపిక చేసుకోండి.

ఈ ప్లాన్స్ ద్వారా కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు లభించవు

వొడాఫోన్ ఐడియా తీసుకొచ్చిన రూ.25 మరియు రూ.55 ప్లాన్ ద్వారా కాలింగ్ మరియు ఎస్ఎంఎస్ ప్రయోజనాలు లభించవు. అలాగే వొడాఫోన్ ఐడియా 5జీ అందుబాటులో లేని కారణంగా, యూజర్లకు కేవలం 4జీ డేటా మాత్రమే లభిస్తుంది.

ఇక్కడ మరొక విషయం తెలుసుకోండి. ఇటీవలె వొడాఫోన్ ఐడియా రూ.75 విలువజేసే డేటా ప్లాన్ ని లాంచ్ చేసింది. ఈ ప్లాన్ ని రీచార్జ్ చేసుకునే కస్టమర్లకు 7 రోజుల వ్యాలిడిటీతో పాటు, 6జిబి డేటా లభిస్తుంది. ఇక ఈ ప్లాన్ ద్వారా కాలింగ్ మరియు ఎస్ఎంఎస్ ప్రయోజనాలు లభించవు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.