లాంచ్ కి ముందు నెట్టింట్లో ప్రత్యక్షమైన Moto E13 డిజైన్ ఇమేజ్

హైలైట్స్

  • 2023 ప్రథమార్థంలో లాంచ్ కానున్న Moto E13 స్మార్ట్ ఫోన్
  • సింగిల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోన్న Moto E13 డివైజ్
  • వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ ని కలిగి ఉన్న Moto E13 స్మార్ట్ ఫోన్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా త్వరలోనే Moto E13 డివైజ్ ని లాంచ్ చేయనుందని సమాచారం. ఈ డివైజ్ ఈ-సిరీస్ లైనప్ లో అత్యంత చవకైన ఫోన్ గా నిలిచే అవకాశం ఉంది. అయితే, తాజాగా ఈ ఫోన్ కి సంబంధించిన పలు వివరాలు నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. లేటెస్ట్ లీక్ ద్వారా Moto E13 యొక్క అఫీషియల్ డిజైన్ ఇమేజ్ బయటకు వచ్చింది.

లీకైన డిజైన్ ఇమేజ్ ని బట్టి, Moto E13 డివైజ్ ని మోటోరోలా డార్క్ గ్రీన్ కలర్ ఆప్షన్ లో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇమేజ్ ద్వారా ఫోన్ యొక్క ఫ్రంట్ మరియు బ్యాక్ డిజైన్ ఎలా ఉందో కనిపిస్తోంది. సరే, ఓసారి Moto E13 యొక్క డిజైన్, స్పెసిఫికేషన్స్ మరియు ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.

Moto E13 కి సంబంధించిన వివరాలు

Moto E13 స్మార్ట్ ఫోన్ బడ్జెట్ కేటగిరీని టార్గెట్ చేస్తూ వస్తోంది. ఈ డివైజ్ భారత్ లో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. 2023 మొదటి త్రైమాసికంలో మోటోరోలా సంస్థ Moto E13 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసే చాన్సెస్ ఉన్నాయి. అధికార ప్రకటన కోసం వేచి చూస్తోన్న తరుణంలో, తాజాగా Moto E13 యొక్క డిజైన్ ఇమేజ్ ని Snoopy Tech రివీల్ చేసింది. దీని ద్వారా ఫోన్ ఫ్రంట్, బ్యాక్ డిజైన్ తెలిసాయి. ఈ ఫోన్ ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్ తో వస్తోంది. పవర్, వాల్యూమ్ బటన్స్ కుడివైపున ఉన్నాయి. ఎడమవైపున సిమ్ ట్రే ఉంది.

ఇక ఫోన్ కి వెనకాల ఒక చిన్న రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది. దానిపై ఏఐ కెమెరా అని రాసి ఉంది. Moto E13 ఫోన్ సింగిల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. కెమెరా మాడ్యూల్ లోపల లెన్స్ తో పాటు, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది.

డిజైన్ రెండర్స్ ద్వారా ఫోన్ మందపాటి చిన్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. యూఎస్బీ టైప్-సీ పోర్ట్, స్పీకర్ గ్రిల్, మైక్రోఫోన్ కటౌట్ ఫోన్ కి బాటమ్ లో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleరవితేజ నటించిన ‘ధమాకా’ మూవీ ఓటీటీ అప్డేట్
Next articleఇటీవలె లాంచైన Redmi K60e విశేషాలు
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.