ఇటీవలె లాంచైన Redmi K60e విశేషాలు

హైలైట్స్

  • చైనాలో ఈమధ్యే లాంచైన Redmi K60e స్మార్ట్ ఫోన్
  • Redmi K60e తో పాటు లాంచైన Redmi K60, Redmi K60 Pro డివైజెస్
  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Redmi K60 సిరీస్

రెడ్మీ కే-సిరీస్ ఫోన్లకు భారత్ లో మాంచి డిమాండ్ ఉంది. దీంతో చాలా కాలం గ్యాప్ తర్వాత ఆమధ్య రెడ్మీ కే50 సిరీస్ ఫోన్లను షావోమి భారత్ లో లాంచ్ చేసింది. కొన్ని రోజుల క్రితం షావోమి చైనాలో Redmi K60 సిరీస్ ని లాంచ్ చేసింది. దీంతో ఈ సిరీస్ భారత్ లోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని రెడ్మీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. ఈ ఆర్టికల్ లో మనం Redmi K60e గురించి తెలుసుకుందాం.

Redmi K60e లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అవి: 6.7-ఇంచ్ 2కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1920హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, పంచ్-హోల్ కటౌట్, హెచ్డీఆర్10+, గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్. ఇలా ఇంకా ఎన్నో సూపర్బ్ ఫీచర్స్ ఉన్నాయి. సరే, ఇంకా ఏమేమున్నాయో తెలుసుకుందాం పదండి మరి.

Redmi K60e స్పెసిఫికేషన్స్

Redmi K60e స్మార్ట్ ఫోన్ 6.7-ఇంచ్ 2కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1920 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, పంచ్-హోల్ కటౌట్, హెచ్డీఆర్10+, గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ తో లాంచైంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ వాడారు. 12జిబి వరకు ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ అందించారు. మెమొరీని మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా పెంచుకోవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Redmi K60e లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఇంకా డ్యూయల్ స్పీకర్స్, ఎన్ఎఫ్‌సీ, ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్ ఉన్నాయి. 5జీ, 4జీ, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. పవర్ బ్యాకప్ కోసం Redmi K60e లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Redmi K60e యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 48ఎంపి సోని ఐఎంఎక్స్582 ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

Redmi K60E ధర

8జిబి ర్యామ్ + 128జిబి వేరియంట్ ధర RMB 2,199 (సుమారు రూ.26,200). 8జిబి+256జిబి వేరియంట్ ధర RMB 2,399 (సుమారు రూ.28,600). 12జిబి+256జిబి మోడల్ ధర RMB 2599 (సుమారు రూ.31,000). 12జిబి + 512జిబి యూనిట్ ధర RMB 2,799 (సుమారు రూ.33,400).

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleలాంచ్ కి ముందు నెట్టింట్లో ప్రత్యక్షమైన Moto E13 డిజైన్ ఇమేజ్
Next articleభారత్ లో Toyota Innova Hycross ధర; స్పెసిఫికేషన్స్, ఫీచర్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.