జనవరి 9 న భారత్ లో లాంచ్ అవుతోన్న Realme 10 4G

హైలైట్స్

  • భారత్ లో Realme 10 4G లాంచ్ ని కన్ఫర్మ్ చేసిన రియల్మీ సంస్థ
  • జనవరి 9 న లాంచ్ కానున్న డివైజ్, ఫ్లిప్ కార్ట్ ద్వారా జరగనున్న అమ్మకాలు
  • మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్, 90 హెర్ట్జ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోన్న Realme 10 4G

కొన్ని రోజుల నుంచి Realme 10 4G గురించి టీజ్ చేస్తూ వస్తోన్న రియల్మీ సంస్థ ఎట్టకేలకు ఈ ఫోన్ లాంచ్ తేదీని ప్రకటించింది. Realme 10 4G డివైజ్ భారత్ లో జనవరి 9 న లాంచ్ అవుతోంది. అలాగే ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ ఫోన్ విక్రయించబడనుంది. 4జీ కనెక్టివిటీతో వస్తున్నందున ధర కూడా అందుబాటులోనే ఉండనుంది.

Realme 10 4G స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ డిస్ప్లే, 50ఎంపి మెయిన్ కెమెరాతో వస్తోంది. సరే, ఓసారి Realme 10 4G యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ మరియు ఇతర వివరాలను తెసుకుందాం పదండి.

Realme 10 4G భారత్ లాంచ్ తేదీ ఖరారు

పైన కనిపిస్తోన్న ఇమేజ్ ని బట్టి Realme 10 4G ఫోన్ 2023 జనవరి 9 న మధ్యాహ్నం 12.30 గంటలకు లాంచ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇది ఫ్లిప్ కార్ట్ యూనిక్ ప్రొడక్ట్ గా పరిగణించబడనుంది. ఫ్లిప్ కార్ట్ లో దర్శనమిస్తోన్న ల్యాండింగ్ పేజీ ద్వారా Realme 10 4G యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ వివరాలు బయటకు వచ్చాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.

Realme 10 4G స్పెసిఫికేషన్స్

Realme 10 4G స్మార్ట్ ఫోన్ 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ వాడారు. ఈ ఫోన్ లో 8జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ మరియు 256జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ అందించారు.

ఇప్పుడు Realme 10 4G యొక్క కెమెరా విభాగం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ స్మార్ట్ ఫోన్ లో 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగా పిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

భద్రత కోసం Realme 10 4G లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఇంకా ఈ ఫోన్ లో హై-రెస్ ఆడియో ఫీచర్ ఉంది. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఈ ఫోన్ లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఇచ్చారు. Realme 10 4G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 3.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleMediaTek Dimensity 700 చిప్, 5000mAh బ్యాటరీతో లాంచైన Vivo Y35m 5G
Next articleచవకైన ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేయనున్న ఏథర్ కంపెనీ
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.