BSNL రూ.184 ప్లాన్: ఉచిత Lystn Podcast సేవలతో పాటు మరెన్నో బెనిఫిట్స్

హైలైట్స్

  • ఎన్నో వాల్యూ ఫర్ మనీ రీచార్జ్ ప్లాన్స్ ఆఫర్ చేస్తోన్న ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్
  • 28 రోజుల వ్యాలిడిటీతో రూ.184 ప్లాన్ ని అందిస్తోన్న బీఎన్ఎన్ఎల్
  • రూ.184 ప్లాన్ తో లభించనున్న ఉచిత లిస్టిన్ పాడ్ కాస్ట్ సేవలు, ఉచిత బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, డెయిలీ 1జిబి డేటా ఇంకా మరెన్నో ప్రయోజనాలు

భారతదేశంలో ప్రభుత్వరంగ టెలీకామ్ సంస్థగా బీఎస్ఎన్ఎల్ ఎన్నో ఏళ్ళుగా యూజర్లకు సేవలు అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్ అంటేనే వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ కి కేరాప్ అడ్రస్. తక్కువ ధరలో ప్లాన్స్ ని అందిస్తూ యూజర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది బీఎస్ఎన్ఎల్.

ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ ప్రయివేట్ ఆపరేటర్లకు గట్టి పోటీ ఇస్తూ నిలబడింది బీఎస్ఎన్ఎల్. ఇటీవలె బీఎస్ఎన్ఎల్ కి కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజీ ప్రకటించింది. దీంతో అటు సంస్థ ఉద్యోగులతో పాటు, ఇటు యూజర్లు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

BSNL త్వరలోనే 4జీ, 5జీ సేవలను లాంచ్ చేయబోతోంది. 4జీ సేవలను దేశ వ్యాప్తంగా విస్తరింపజేశాక, ఆ వెనువెంటనే 5జీ నెట్వర్క్ ని లాంచ్ చేయనుంది BSNL. ఎప్పుడెప్పుడు 4జీ, 5జీ సేవలు వస్తాయా అని యూజర్లు వేచి చూస్తున్నారు. సరే, ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ అందిస్తోన్న రూ.184 ప్లాన్ గురించి తెలుసుకుందాం పదండి.

BSNL రూ.184 ప్లాన్

BSNL సంస్థ రూ.184 రీచార్జ్ ప్లాన్ ని పరిచయం చేసింది. ఈ ప్లాన్ ద్వారా యూజర్ కి వివిధ రకాల ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క బెనిఫిట్స్ ఏంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. పదండి.

BSNL రూ.184 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

BSNL రూ.184 ప్లాన్ రీచార్జ్ చేసుకునే కస్టమర్లకు 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అలాగే ప్రతి రోజూ 1జిబి డేటా లభిస్తుంది. డేటా పరిధి ముగిశాక ఇంటర్నెట్ వేగం 40కేబీపీఎస్ కి పడిపోతుంది. అయినప్పటికీ మీరు ఇంటర్నెట్ బ్రౌజ్ చేయవచ్చు. అందుకు మీకు ఎటువంటి చార్జీలు పడవు. అలాగే ప్రతిరోజూ మీకు 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. ఇంకా దేశంలోని ఏ నెట్వర్క్ కి అయినా ఉచితంగా కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్లాన్ ద్వారా లభించే అదనపు ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

BSNL Rs.184 Plan Benefits

  • 28 రోజుల వ్యాలిడిటీ
  • డెయిలీ 1జిబి డేటా
  • డెయిలీ 100 ఎస్ఎంఎస్
  • అపరిమిత కాలింగ్ సౌకర్యం
  • ఉచిత బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్
  • ఉచిత లిస్టిన్ పాడ్‌కాస్ట్ సేవలు

BSNL రూ.184 ప్లాన్ అదనపు ప్రయోజనాలు

BSNL రూ.184 ప్లాన్ రీచార్జ్ చేసుకునే వారికి డెయిలీ డేటా, ఉచిత ఎస్ఎంఎస్, ఉచిత కాల్స్, వ్యాలిడిటీతో పాటు అదనంగా బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ ఉచితంగా లభిస్తాయి. ఇంకా టెలీఫోనిక్ డిజిటల్ మీడియా అందించే Lystn Podcast సర్వీసెస్ ఉచితంగా లభిస్తాయి. ఈ ప్లాన్ వివరాలను సరిగ్గా చదివి, మీకు సరిపోయేదనిపిస్తే రీచార్జ్ చేసుకోండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleరూ.6,499 ధరతో భారత్ లో లాంచైన POCO C50
Next articleExynos 1380 చిప్, 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తోన్న Samsung Galaxy A54
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.