హైలైట్స్
- జనవరి 18 న భారత్ లో లాంచ్ కానున్న Samsung Galaxy A14 5G
- నెట్టింట్లో ప్రత్యక్షమైన Samsung Galaxy A14 5G స్పెసిఫికేషన్స్
- ఎగ్జినోస్ లేదా డైమెన్సిటీ చిప్సెట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి కెమెరాతో వస్తోన్న Samsung Galaxy A14 5G

Samsung Galaxy A14 5G స్మార్ట్ ఫోన్ యూఎస్ మరియు యూరోప్ లోని ఎన్నో మార్కెట్స్ లో లాంచ్ అయ్యింది. యూఎస్ వేరియంట్ లో ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్ వాడగా, యూరోప్ వేరియంట్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్ వాడారు. అయితే భారత్ లో ఏ చిప్ వేరియంట్ ని శాంసంగ్ లాంచ్ చేయనుందో ఇంకా తెలియదు.
Samsung Galaxy A14 5G స్మార్ట్ ఫోన్ భారత్ లో లైట్ గ్రీన్, డార్క్ రెడ్ మరియు సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. సరే, ఓసారి Samsung Galaxy A14 5G యొక్క పూర్తి వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం. పదండి.
Samsung Galaxy A14 5G స్పెసిఫికేషన్స్
Samsung Galaxy A14 5G స్మార్ట్ ఫోన్ లో 6.6-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ ఉన్నాయి. అయితే ఇండియన్ వేరియంట్ యొక్క ప్రాసెసర్ యొక్క వివరాలు ఇంకా తెలియదు. ఈ స్మార్ట్ ఫోన్ 4జిబి మరియు 6జిబి ర్యామ్ ఆప్షన్స్ లో లభిస్తుంది. 64జిబి మరియు 128జిబి స్టోరేజీ ని ఈ ఫోన్ లో అందించారు.
Samsung Galaxy A14 5G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ లో అందించారు. Samsung Galaxy A14 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో ర్యామ్ ప్లస్ ఫీచర్ ఉంది. దీంతో ర్యామ్ ని ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు.
Samsung Galaxy A14 5G స్మార్ట్ ఫోన్ 167.7 మిల్లీ మీటర్ల పొడవు, 78.0 మిల్లీ మీటర్ల వెడల్పు, 9.1 మిల్లీ మీటర్ల మందం, 202 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











