631 కిలోమీటర్ల రేంజ్ తో భారత్ లో లాంచైన Hyundai Ioniq 5

హైలైట్స్

  • రూ.1 లక్ష టోకెన్ అమౌంట్ చెల్లించి హ్యాందాయ్ కంపెనీ వెబ్ సైట్ నుంచి Hyundai Ioniq 5 ని బుక్ చేసుకునే అవకాశం
  • ఏఆర్ఏఐ సర్టిఫికేషన్ ప్రకారం సింగిల్ చార్జ్ పై 631 కిలోమీటర్ల దూరం వెళ్ళనున్న Hyundai Ioniq 5
  • కేవలం 18 నిమిషాల్లో 80 శాతం చార్జ్ కానున్న Hyundai Ioniq 5 కారు బ్యాటరీ

భారతీయ ఎలక్ట్రిక్ మార్కెట్ లో హ్యుందాయ్ కంపెనీ ప్రభంజనం సృష్టిస్తోంది. Auto Expo 2023 లో Hyundai Ioniq 5 ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఈ కారు 631 కిలోమీటర్ల రేంజ్ తో వచ్చింది. ఈ ఈవెంట్ లో తన లేటెస్ట్ ఎలక్ట్రిక్ కారు ధరను కంపెనీ వెల్లడించింది. ఈ కారు యొక్క బుకింగ్ కూడా లాంచ్ కి ముందే ప్రారంభమైంది. బుకింగ్ కోసం కస్టమర్లు రూ.1 లక్ష చెల్లించాల్సి ఉంటుంది. సరే ఓసారి Hyundai Ioniq 5 కారు యొక్క స్పెసిఫికేషన్స్, ధర వివరాలు తెలుసుకుందాం.

Hyundai Ioniq 5 ధర

Hyundai Ioniq 5 ఎలక్ట్రిక్ కారుని బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ Auto Expo 2023 ఈవెంట్ లో లాంచ్ చేశారు. లాంచ్ సమయంలోనే కంపెనీ ఈ కారు యొక్క ధరలను ప్రకటించింది. Hyundai Ioniq 5 ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ.44.95 లక్షలుగా ఉంది. అయితే ఈ ఇంట్రడక్టరీ ధరతో కేవలం మొదటి 500 మంది కస్టమర్లు మాత్రమే కారుని బుక్ చేసుకోవచ్చు. తర్వాత ధర పెరగనుంది.

Hyundai Ioniq 5 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

Hyundai Ioniq 5 ఎలక్ట్రిక్ కారుని హ్యాందాయ్ కంపెనీ ఈ-జీఎంపి ప్లాట్ఫామ్ పై తయారు చేసింది. పంప్-టు-ప్లగ్ రెవొల్యూషన్ ఈ కారుతో మొదలు కానుంది. స్పెషల్ ఫీచర్ క్రింద, Hyundai Ioniq 5 కారులో 21 హ్యుందాయ్ స్మార్ట్‌సెన్స్ (లెవెల్ 2 ఏడీఏఎస్) ని అందించారు.

Hyundai Ioniq 5 ఈవీ 4,635 మిల్లీ మీటర్ల పొడవు, 1,890 మిల్లీ మీటర్ల వెడల్పు, 1,625 మిల్లీ మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ మోడల్ యొక్క వీల్ బేస్ 3,000 ఎంఎం గా ఉంటుంది. మ్యాట్ గ్రావిటీ గోల్డ్, ఆప్టిక్ వైట్ మరియు మిడ్నైట్ బ్లాక్ పర్ల్ కలర్ ఆప్షన్స్ తో ఈ కారు లభిస్తుంది. భద్రత ఫీచర్లలో భాగంగా, Hyundai Ioniq 5 కారులో 6 ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, వీఈఎస్ఎస్, ఈపీబీ, ఎంసీబీ, 4 డిస్క్ బ్రేక్స్ అందిస్తున్నారు.

Hyundai Ioniq 5 లో పారామెట్రిక్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, ఇంటెగ్రేటెడ్ స్కిడ్ ప్లేట్స్, 20-ఇంచ్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్స్, షార్క్-ఫిన్ యాంటెన్నా, ఇంటెగ్రేటెడ్ స్పాయిలర్ మరియు రేక్డ్ రియర్ విండ్ షీల్డ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

18 నిమిషాల్లో 80 శాతం చార్జింగ్

Hyundai Ioniq 5 కారులో 72.6 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అందించారు. ఇది 214 బీహెచ్‌పీ మరియు 350 నానోమీటర్ టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. రిపోర్ట్స్ ప్రకారం, ఈ కారులో ఏఆర్ఏఐ-సర్టిఫకేషన్ రేంజ్ 631 కిలోమీటర్ల దూరం సింగిల్ చార్జ్ పై వెళ్తుంది. 350 కిలోవాట్ డీసీ చార్జర్ ద్వారా కారుని 10 శాతం నుంచి 80 శాతానికి కేవలం 18 నిమిషాల్లో చార్జ్ చేయవచ్చు.

Hyundai Ioniq 5 కారులో 12.3-ఇంచ్ సైజు కల్గిన రెండు భారీ స్క్రీన్స్ ని అందించారు. వీటిలో ఒక స్క్రీన్ ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్ కోసం కాగా, మరొకటి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం ఇవ్వబడింది. ఇతర ఫీచర్లను చూస్తే, ఈ కారులో 8-స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, బ్లూలింక్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, పవర్డ్ టెయిల్ గేట్, హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు వైర్లెస్ చార్జింగ్ ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleగ్లోబల్ లాంచ్‌కి ముందు లీకైన Vivo X90, Vivo X90 Pro ధరలు
Next articleలీకైన Samsung Galaxy A34, A54 రెండర్స్; రివీలైన డిజైన్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.