హైలైట్స్
- త్వరలో లాంచ్ కానున్న OnePlus Nord CE 3 స్మార్ట్ ఫోన్
- ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోన్న OnePlus Nord CE 3
- తాజాగా లీకైన OnePlus Nord CE 3 లైవ్ ఇమేజెస్; గ్లాసీ బ్లాక్ కలర్ ఆప్షన్ తో లాంచ్ కానున్న డివైజ్
Nord సిరీస్ లో కొత్త ఫోన్ ని లాంచ్ చేసేందుకు వన్ ప్లస్ సంస్థ సిద్ధమవుతోంది. నార్డ్ 2టీ కి సక్సెసర్ గా నార్డ్ 3 ని తీసుకురానున్నట్లు కొన్ని రోజులుగా రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే వన్ప్లస్ కంపెనీ OnePlus Nord CE 3 ని కూడా లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. వన్ ప్లస్ సంస్థ లాంచ్ కి సంబంధించిన ఎటువంటి వివరాలను ఇప్పటివరకు రివీల్ చేయలేదు.
తాజాగా OnePlus Nord CE 3 కి సంబంధించిన కొన్ని వివరాలు నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. కొత్త లీక్ ద్వారా OnePlus Nord CE 3 యొక్క లైవ్ ఇమేజ్ బయటకు వచ్చింది. సరే, ఓసారి OnePlus Nord CE 3 5జీ డివైజ్ స్పెసిఫికేషన్స్, డిజైన్ మరియు ఇతర వివరాలను గురించి తెలుసుకుందాం పదండి.
లీకైన OnePlus Nord CE 3 డిజైన్
OnePlus Nord CE 3 భారత్ తో పాటు ఇతర మార్కెట్స్ లో మిడ్-రేంజ్ ఫోన్ గా లాంచ్ కానుంది. తాజాగా ఈ ఫోన్ లైవ్ ఇమేజ్ ఆన్ లైన్ లో లీకైంది. నార్డ్ సీఈ3 ఫోన్ యొక్క ఇమేజ్ గా చెప్పబడుతోన్న ఆ లైవ్ ఇమేజ్ లో రెండు భారీ సర్క్యులర్ కటౌట్స్ రియర్ ప్యానెల్ పై కనిపిస్తున్నాయి. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. RMUpdate షేర్ చేసిన లైవ్ ఇమేజెస్ ని బట్టి, పైన కటౌట్ లో ఒక సెన్సర్, క్రింది కటౌట్ లో రెండు సెన్సర్స్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ మాడ్యూల్ ఉంది.
OnePlus Nord CE 3 ఫ్లాట్ ఫ్రేమ్ ని కలిగి ఉన్నట్లు అర్థమవుతోంది. ఇక రియర్ ప్యానెల్ చూస్తే కాస్త కర్వ్డ్ గా ఉంది. లైవ్ ఇమేజ్ లో బ్లాక్ కలర్ వేరియంట్ ని మనం చూడవచ్చు. ఇక బ్యాక్ ప్యానెల్ గ్లాసీ టెక్షర్ ని కలిగి ఉంది. ఈ ఫోన్ ప్లాస్టిక్ ఫ్రేమ్, ప్లాస్టిక్ బ్యాక్ ప్యానెల్ తో వస్తున్నట్లు సమాచారం.
OnePlus Nord CE 3 స్పెసిఫికేషన్స్ (అంచనా)
OnePlus Nord CE 3 స్మార్ట్ ఫోన్ 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ తో వస్తోంది. ఈ ఫోన్ లో అల్ట్రావైడ్ సెన్సర్ ఉండబోదు. లీకైన వివరాలను బట్టి ఈ విషయం స్పష్టమవుతోంది.
OnePlus Nord CE 3 స్మార్ట్ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ ఉండనుంది. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. OnePlus Nord CE 3 డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో వస్తోంది. 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్ కూడా ఉంటుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












