హైలైట్స్
- భారత్ లో లాంచైన Samsung Galaxy A14 స్మార్ట్ ఫోన్
- ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్ తో వచ్చిన Samsung Galaxy A14 డివైజ్
- భారత్ లో Samsung Galaxy A14 స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ.16,499

Samsung Galaxy A14 స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ తో పాటు Samsung Galaxy A23 స్మార్ట్ ఫోన్ కూడా లాంచ్ అయ్యింది. Samsung Galaxy A14 విషయానికి వస్తే, ఈ ఫోన్ లో వాటర్ డ్రాప్ నాచ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, రెక్టాంగ్యులర్ మాడ్యూల్, క్వాడ్-కెమెరా సెన్సర్స్ ఉంటాయి.
Samsung Galaxy A14 స్మార్ట్ ఫోన్ ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్, 5జీ కనెక్టివిటీతో వచ్చింది. ఈ ఫోన్ లో 6.6-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి.
భారత్ లో Samsung Galaxy A14 ధర
Samsung Galaxy A14 స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.16,499 గా ఉంది. ఇకపోతే 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.18,999 గా నిర్ణయించారు. అలాగే 8జిబి ర్యామ్ + 128జిబి యూనిట్ ధర రూ.20,999 గా ఉంది. ఈ హ్యాండ్సెట్ డార్క్ రెడ్, లైట్ గ్రీన్, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఎస్బీఐ, ఐడీఎఫ్‌సీ, జెస్ట్‌మనీ ద్వారా ఫోన్ కొనుగోలుపై శాంసంగ్ కంపెనీ రూ.1,500 క్యాష్‌బ్యాక్ ఇస్తోంది.
Samsung Galaxy A14 స్మార్ట్ ఫోన్ శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ మరియు పార్ట్నర్ స్టోర్స్, శాంసంగ్.కామ్ ఇతర ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్ ద్వారా జనవరి 20 నుంచి సేల్ కి అందుబాటులో ఉంటుంది. శాంసంగ్.కామ్ పై లైవ్ కామర్స్ ద్వారా Samsung Galaxy A14 ఫోన్ ని జనవరి 18 మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయవచ్చు.
Samsung Galaxy A14 స్పెసిఫికేషన్స్
- 6.6-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే
- ఎగ్జినోస్ 1330 చిప్సెట్
- 8జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్
- 50ఎంపి + 2ఎంపి + 2ఎంపి ట్రిపుల్ కెమెరా సెటప్
- 13ఎంపి సెల్ఫీ కెమెరా
Samsung Galaxy A14 స్మార్ట్ ఫోన్ లో 6.6-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్, ఎగ్జినోస్ 1330 చిప్, 8జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ ఉంటాయి. Samsung Galaxy A14 ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. రెండేళ్ళ పాటు ఆండ్రాయిడ్ మేజర్ అప్డేట్స్ ని శాంసంగ్ హామీనిస్తోంది.
Samsung Galaxy A14 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 5జీ, 4జీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉంటాయి.
Samsung Galaxy A14 స్మార్ట్ ఫోన్ యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











