Indian Gadget Awards 2022: మొబైల్ అవార్డ్ కేటగిరీలు మరియు విజేతలు

Highlights

  • ఇండియన్ గాడ్జెట్ అవార్డ్స్ 2022 లో మొత్తం 28 అవార్డు కేటగిరీలు
  • 24 అవార్డు విభాగాల్లో విజేతలను ఎంపిక చేయనున్న జ్యూరీ సభ్యులు
  • 4 కేటగిరీలు వినియోగదారుల ద్వారా ఎంపిక
  • నేడు (జనవరి 31) ప్రకటించబడిన అన్ని విభాగాల విజేతల వివరాలు

Indian Gadget Awards 2022: మొబైల్ అవార్డ్ కేటగిరీలు మరియు విజేతలు

ఇండియన్ గ్యాడ్జెట్ అవార్డ్స్ 2022 (వాయిస్ ఆఫ్ ద ఇండస్ట్రీ), ఇది 20 టెక్ పబ్లికేషన్స్ మరియు భారతీయ యూట్యూబర్లు కలిసి చేపట్టిన ఒక గొప్ప కార్యక్రమం. 2022 లో ఉత్తమమైన గ్యాడ్జెట్స్ ని గుర్తించేందుకు వీరంతా చేతులు కలిపారు. లీడింగ్ గ్యాడ్జెట్ ఎక్స్‌పర్ట్స్ అయిన జ్యూరీ సభ్యులు విజేతలను అనానిమస్ ఓటింగ్ ద్వారా నిర్ణయించారు.

Indian Gadget Awards 2022 కి చెందిన 35 మంది కొలాబరేటర్స్ యొక్క వెబ్‌సైట్స్ మరియు యూట్యూబ్ చానల్స్ పై అవార్డ్స్ షోకేజ్ చేయబడ్డాయి.

IGA 2022

  • స్మార్ట్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్, టీవీలు, వేరబుల్స్ తదితర వాటికి 28 అవార్డులు
  • 4 యూజర్ చాయిస్ అవార్డ్స్
  • టాప్ రివ్యూవర్స్, ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ తో కూడిన 18 జ్యూరీ మెంబర్స్
  • లీడింగ్ టెక్ కంటెంట్ క్రియేటర్స్ తో కూడిన 13 సోషల్ మీడియా భాగస్వాములు
  • 35+ కొలాబరేటర్స్, 100 మిలియన్ కి పైగా ఆడియన్స్

2022 ఏడాది ఉత్తమ ఫోన్ (రూ.15 వేల ధర లోపు) అవార్డు విజేత – Moto G62 5G

ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ లో 5జీ కనెక్టివిటీతో కూడిన స్మార్ట్ ఫోన్లు చాలానే వచ్చాయి. ఇది భారతదేశం నెక్ట్స్-జెన్ నెట్వర్కింగ్ టెక్నాలజీకై ముందడుగు వేసేందుకు ఎంతగానో దోహదపడనుంది. ఫీచర్ ఫోన్ నుంచి అప్‌గ్రేడ్ అయ్యే వారికి లేదా తొలిసారిగా ఫోన్ కొనే యూజర్లకు ఈ స్మార్ట్ ఫోన్లు వీలైనన్ని ఉత్తమ మార్గాల్లో బేసిక్స్ ని అందించేందుకు తోడ్పడతాయి. ఈ అవార్డుని Moto G62 5G గెలుచుకుంది.

నామినీస్

  • Samsung Galaxy F23 5G
  • Moto G62 5G
  • iQOO Z6 5G
  • realme 9i
  • Redmi 11 Prime 5G
  • Infinix Note 12 5G

2022 ఏడాది ఉత్తమ ఫోన్ (రూ.30 వేల ధర లోపు) అవార్డు విజేత – OnePlus Nord 2T 5G

ముఖ్యమైన ఆప్షన్స్ ఉండే, ఎంతో డిమాండ్ ఉన్న కేటగిరీ ఇది. ఈ అవార్డ్ కోసం గట్టిపోటీనే ఉంది. పలు కంపెనీలు పురస్కారం కోసం బరిలో నిలిచాయి. దీంతో జ్యూరీ సభ్యులకు కూడా విన్నర్ ని తేల్చడం సవాలుతో కూడుకున్న విషయమే. అయితే పోటీలో OnePlus Nord 2T 5G విజేతగా నిలిచింది.

నామినీస్

  • Tecno Camon 19 Pro
  • POCO F4 5G
  • Redmi K50i 5G
  • OnePlus Nord 2T 5G
  • iQOO Neo 6 5G
  • Xiaomi 11i HyperCharge 5G
  • Moto Edge 30
  • Samsung Galaxy M53 5G
  • Realme GT NEO 3T 80W
  • Redmi Note 11 Pro+ 5G
  • Realme 9 Pro+

2022 ఏడాది ఉత్తమ ఫోన్ (రూ.50 వేల ధర లోపు) అవార్డు విజేత – iQOO 9T

ఫ్లాగ్షిప్ పెర్ఫామెన్స్, ఫ్లాగ్షిప్ ఇమేజింగ్, పూర్తి ఫ్లాగ్షిప్ అనుభూతిని ఈ ఫోన్స్ యూజర్ కి పంచుతాయి. ఈ కేటగిరీ కూడా టన్నుల కొద్ది ఆప్షన్స్ తో వచ్చింది. స్మార్ట్ ఫోన్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ విషయంలో ఈ ఫోన్లు ఆల్ రౌండర్స్ అని చెప్పవచ్చు. వీటిని తక్కువ అంచనా వేయలేం. తమదైన స్థాయిలో ఇక్కడ ఉన్న నామినీస్ అన్నీ విన్నర్లే. అయితే అన్నింటినీ దాటేసి iQOO 9T అవార్డుని గెలుచుకుంది.

నామినీస్

  • Nothing Phone (1)
  • OnePlus 10T 5G
  • iQOO 9T
  • Motorola Edge 30 Fusion
  • Realme GT 2 Pro
  • Realme GT NEO 3
  • OPPO Reno8 Pro 5G
  • Vivo V25 Pro
  • Samsung Galaxy S21 FE 5G

2022 ఏడాది ఉత్తమ సెల్ఫీ ఫోన్ – మెయిన్‌స్ట్రీమ్ (రూ.30 వేల ధర లోపు) అవార్డు విజేత – Vivo V25 5G

ఫోన్లలో ఫ్రంట్ కెమెరాలు విభిన్న రకాలుగా రావొచ్చు. నాచెస్ లో ఉండటం లేదా పంచ్ హోల్స్ లో రావడం మనం గమనిస్తాం. ఈ రోజుల్లో సెల్ఫీ కెమెరాలు కూడా ఎన్నో ఫీచర్లతో వస్తున్నాయి. ప్రైమరీ కెమెరాలు పెర్ఫామ్ చేసే పనులను ఫ్రంట్ కెమెరాలు కూడా చేస్తున్నాయి. ఆమేరకు సెల్ఫీ కెమెరాలను కంపెనీలు తయారు చేస్తున్నాయి. అయితే, సదరు ఫోన్లన్నీ నాణ్యమైన సెల్ఫీలను తీయడంతోపాటు, వీడియో కాలింగ్ అనుభూతిని అందించాల్సి ఉంటుంది. ఈ అవార్డు అందుకు ఉద్దేశించినదే. అయితే ఈ అవార్డుని Vivo V25 5G గెలుచుకుంది.

నామినీస్

  • Motorola Edge 30
  • TECNO CAMON 19 Pro
  • Redmi K50i 5G
  • Samsung Galaxy M53 5G
  • OnePlus Nord 2T 5G
  • Realme 9 Pro+
  • OPPO Reno 8 5G
  • Vivo V25 5G
  • Samsung Galaxy A53 5G

2022 ఏడాది ఉత్తమ కెమెరా ఫోన్ – మెయిన్ స్ట్రీమ్ (రూ.30 వేల ధర లోపు) అవార్డు విజేత – Realme 9 Pro+

చాలామంది స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఫోటోగ్రఫీ అనేది ఎంతో ముఖ్యమైంది. వీరికి కాలింగ్ మరియు మెసేజింగ్ కంటే ఫోటోగ్రఫీయే ప్రాధాన్యమైంది. రియల్ లైఫ్ లో ఈ మెయిన్ స్ట్రీమ్ ఫోన్లు ఏమేరకు తమ ఇమేజింగ్ సామర్థ్యాలను ప్రదర్శిస్తాయో చూడాలి. ఈ సెగ్మెంట్ లోని స్మార్ట్ ఫోన్లు, ప్రీమియమ్ స్మార్ట్ ఫోన్లతో కూడా పోటీపడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. అయితే అన్నింటినీ దాటేసి Realme 9 Pro+ (రూ.30 వేల ధరలోపు) ఉత్తమ కెమెరా ఫోన్ అవార్డుని గెలుచుకుంది.

నామినీస్

  • Realme 9 Pro+
  • iQOO Neo 6
  • Realme GT NEO 3T
  • OnePlus Nord 2T 5G
  • Samsung Galaxy M53 5G
  • Motorola Edge 30

2022 ఏడాది ఉత్తమ కెమెరా ఫోన్ – ప్రీమియమ్ (బడ్జెట్ పరిధి లేదు) అవార్డు విజేత – Samsung Galaxy S22 Ultra 5G

డీఎస్ఎల్ఆర్ లెవెల్ క్వాలిటీ అందిస్తూ అన్ని ఫీచర్లను కలిగి ఉంటాయి ఈ సెగ్మెంట్ ఫోన్లు. ఇక్కడ మేం సీరియస్ ఫోటోగ్రఫీ సామర్థ్యతను గురించి మాట్లాడుతున్నాం. అంటే విన్నర్ ని నిర్ణయించడం పాయింట్ అండ్ షూట్ టాస్క్ లాంటిదన్నమాట. అదృష్టవశాత్తు, మా ఎక్స్‌పర్ట్స్ విజేతను నిర్ణయించారు. అన్నింటినీ వెనక్కి నెట్టేసి ఈ అవార్డుని Samsung Galaxy S22 Ultra 5G కైవసం చేసుకుంది.

నామినీస్

  • Samsung Galaxy S22 Ultra 5G
  • Google Pixel 7 Pro
  • Apple iPhone 14 Pro Max
  • Vivo X80 Pro
  • Xiaomi 12 Pro
  • Motorola Edge 30 Ultra

2022 ఏడాది ఉత్తమ గేమింగ్ ఫోన్ అవార్డు విజేత – ASUS ROG Phone 6 Pro

పెర్ఫామెన్స్, థర్మల్స్, డిస్ప్లే క్వాలిటీ, ఆడియో, బ్యాటరీ లైఫ్ మరియు సాఫ్ట్‌వేర్ ఫీచర్స్ అనేవి గేమింగ్ ఫోన్స్ లో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ గేమింగ్ సెగ్మెంట్ లో చాలా ఫోన్లు పోటీపడ్డాయి. అయితే ASUS ROG Phone 6 Pro ని అవార్డు వరించింది.

నామినీస్

  • iQOO 9T 5G
  • Redmi K50i 5G
  • Realme GT Neo 3
  • Apple iPhone 14 Plus
  • Apple iPhone 14 Pro Max
  • Vivo X80
  • ASUS ROG Phone 6 Pro
  • Samsung Galaxy S22 Ultra 5G
  • OnePlus 10T 5G

2022 ఏడాది ఉత్తమ ఫోన్ (ఓవరాల్) అవార్డు విజేత – Samsung Galaxy S22 Ultra

ఇది అత్యంత ముఖ్యమైన అవార్డు. ఈ ఏడాది లాంచైన వందల ఫోన్ల నుంచి అన్ని సెగ్మెంట్స్ లో ఉత్తమంగా నిలిచిన ఫోన్ ఈ అవార్డు గెలుచుకుంటుంది. అన్ని అద్భుతమైన ఫీచర్లను కలిగి, బెస్ట్ ఆల్-రౌండర్ గా నిలిచిన Samsung Galaxy S22 Ultra ఈ అవార్డుకి ఎంపికైంది.

నామినీస్

  • Samsung Galaxy S22 Ultra
  • Google Pixel 7 Pro
  • Apple iPhone 14 Pro Max
  • Vivo X80 Pro
  • Xiaomi 12 Pro 5G
  • Motorola Edge 30 Ultra
  • Samsung Galaxy Z Fold 4
  • Samsung Galaxy Z Flip 4
  • OnePlus 10 Pro 5G
  • iQOO 9 Pro
  • Realme GT 2 Pro

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.