
భారత్ లో ఐకూ కంపెనీ iQOO Neo 7 స్మార్ట్ ఫోన్ ని ఫిబ్రవరి 16 న లాంచ్ చేయనుంది. అయితే లాంచ్ కి ముందు iQOO Neo 7 స్మార్ట్ ఫోన్ I2214 అనే మోడల్ నంబర్ తో గీక్ బెంచ్ డేటాబేస్ పై కనిపించింది. ఈ బెంచ్ మార్క్ లిస్టింగ్ ద్వారా iQOO Neo 7 మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ తో వస్తున్నట్లు స్పష్టమైంది.
చైనా మార్కెట్ లో లాంచైన iQOO Neo 7 SE కి రీబ్రాండ్ వర్షన్ గా iQOO Neo 7 ఫోన్ భారత్ కి వస్తోందని గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా మరోసారి తెలిసింది. గత నెలలో iQOO Neo 7 SE చైనాలో లాంచైంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ తో వచ్చింది. సరే, ఓసారి వివరాలను పూర్తిగా తెలుసుకుందాం పదండి.
iQOO Neo 7 Geekbench స్కోర్

iQOO Neo 7 స్మార్ట్ ఫోన్ గీక్ బెంచ్ పై కనిపించింది. Geekbench 5 బెంచ్ మార్క్ టెస్ట్ లో సింగిల్ కోర్ పై 998 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్టులో 3938 పాయింట్లు సాధించింది. లిస్టింగ్ ద్వారా ఈ ఫోన్ 1+3+4 కోర్ కన్ఫిగరేషన్, 3.10Ghz పీక్ ఫ్రీక్వెన్సీ తో కూడిన ఆక్టా-కోర్ ప్రాసెసర్ ని కలిగి ఉన్నట్లు అర్థమవుతోంది. దీన్ని బట్టి, iQOO Neo 7 ఇండియన్ వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
ఇంకా ఈ లిస్టింగ్ ద్వారా iQOO Neo 7 ఫోన్ లో 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, ఫన్టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ ఉంటాయని తెలిసింది. సరే, ఈ ఫోన్ iQOO Neo 7 SE కి రీబ్రాండ్ వర్షన్ అని స్పష్టమైంది కనుక, ఓసారి iQOO Neo 7 SE స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.
iQOO Neo 7 SE స్మార్ట్ ఫోన్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి.
iQOO Neo 7 SE లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి హై రెజుల్యూషన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 2ఎంపి డెప్త్ కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ హ్యాండ్సెట్ లో స్టీరియో స్పీకర్ సెటప్, టైప్-సీ చార్జింగ్ పోర్ట్ ఉంటాయి. వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 5జీ, 4జీ వొల్టీ, డ్యూయల్ సిమ్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉంటాయి. https://www.indiangadgetawards.com/
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











