
అందుబాటు ధరల్లో అధిక ఫీచర్లతో ఫోన్లను లాంచ్ చేస్తూ తక్కువ సమయంలోనే ప్రముఖ బ్రాండ్ గా అవతరించింది iQOO. త్వరలోనే ఈ సంస్థ iQOO Neo 7 5G ఫోన్ ని భారత్ లో లాంచ్ చేయబోతోంది. ఈ లోపు ఫోన్ కి సంబంధించిన ఎన్నో లీక్స్, రూమర్స్ నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి.
ఇక ఫోన్ కోసం వెయిట్ చేసే వారు లాంచ్ తేదీ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి 16 న ఈ ఫోన్ లాంచ్ అవుతోంది. ఈ క్రమంలో తాజాగా ఈ ఫోన్ కి సంబంధించిన కీలక వివరాలు తెలిసాయి. 12GB LPDDR5 ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీతో ఈ ఫోన్ వస్తోంది. ఇతర వివరాలు తెలుసుకుందాం పదండి.
ఐకూ నియో 7 5జీ ర్యామ్, స్టోరేజీ, అంటుటు స్కోర్
iQOO Neo 7 5G ఫోన్ 12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీతో రానున్నట్లు సమాచారం. భారతదేశపు తొలి డైమెన్సిటీ 8200 చిప్సెట్ ఫోన్ గా iQOO Neo 7 5G నిలవనుంది. ప్రస్తుతం అమెజాన్, ఐకూ ఇండియా వెబ్ సైట్స్ లో iQOO Neo 7 5G మైక్రోసైట్స్ దర్శనమిస్తున్నాయి. ఐకూ కంపెనీ యొక్క Extended RAM 3.0 టెక్నాలజీ ద్వారా ఈ ఫోన్ 8జిబి వర్చువల్ ర్యామ్ కెపాసిటీతో వస్తోంది.
ఇక డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ తో కూడిన iQOO Neo 7 5G AnTuTu స్కోర్ విషయానికి వస్తే ఇది 893,690 స్కోర్ ని నమోదు చేసింది. ఈ స్కోర్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్ కి చెందినదని కంపెనీ చెప్పింది.
ఐకూ నియో 7 5జీ స్పెసిఫికేషన్స్
iQOO Neo 7 5G స్మార్ట్ ఫోన్ 6.78-ఇంచ్ ఈ5 అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హోల్ పంచ్ సెల్ఫీ కెమెరా, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ తో వస్తోంది. iQOO Neo 7 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఫుల్ సైజ్ 3డీ కూలింగ్ సిస్టమ్ తో ఈ ఫోన్ వస్తున్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది.
iQOO Neo 7 5G స్మార్ట్ ఫోన్ 5జీ కనెక్టివిటీ, బ్లూ, గ్రే కలర్ ఆప్షన్స్ తో వస్తోంది. iQOO Neo 7 5G యొక్క కెమెరా విభాగానికి వస్తే, ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా సెన్సర్, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. ఈ మోడల్ లో అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాతో రావడం లేదు. ఈ ఫోన్ ధర దాదాపు రూ.30,000 గా ఉండవచ్చు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి కెమెరా ఉంటుంది.
iQOO Neo 7 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లాంచ్ తర్వాత అమెజాన్ ఇండియా అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా కొనుగోలుకి అందుబాటులోకి వస్తుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











