
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO నేడు భారత్ లో Reno 8T 5G ని లాంచ్ చేసింది. స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 108ఎంపి కెమెరా, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తదితర స్పెసిఫికేషన్స్ తో వచ్చిన ఈ ఫోన్ రూ.30,000 లోపు ధరతో వచ్చింది. సరే ఇప్పుడు మనం OPPO Enco Air 3 ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ గురించి తెలుసుకుందాం. నేడు ఈ ఇయర్ బడ్స్ ని ఒప్పో భారత్ లో లాంచ్ చేసింది.
OPPO Enco Air 3 TWS ట్రాన్స్‌పరెంట్ లిడ్, హాఫ్ ఇన్-ఇయర్ డిజైన్ తో వచ్చింది. ఆడియో ఫైల్-గ్రేడ్ ఆడియో ప్రాసెసింగ్ కోసం ఈ బడ్స్ లో హై-ఫై డీఎస్పీ ఫీచర్ ఉంది. సరే, ఓసారి OPPO Enco Air 3 TWS స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
భారత్ లో OPPO Enco Air 3 TWS ధర, సేల్ తేదీ
OPPO Enco Air 3 TWS ధరను భారత్ లో రూ.2,999 గా నిర్ణయించారు. ఈ బడ్స్ ని ఫ్లిప్ కార్ట్, అమెజాన్, ఒప్పో వెబ్ సైట్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఫిబ్రవరి 10 నుంచి సేల్ మొదలవుతుంది. గేజ్ వైట్ కలర్ ఆప్షన్ లో ఈ బడ్స్ లభిస్తాయి.
OPPO Enco Air 3 TWS స్పెసిఫికేషన్స్, ఫీచర్స్
OPPO Enco Air 3 TWS ఇయర్ బడ్స్ 13.4 డైనమిక్ యూనిట్ డ్రైవర్స్ తో వచ్చాయి. ఈ ఇయర్ బడ్స్ హాఫ్ ఇన్-ఇయర్ స్టైల్ డిజైన్ తో వచ్చాయి. బాటమ్ లో డ్యూ డ్రాప్ డిజైన్ తో కూడిన స్టెమ్ తో ఈ బడ్స్ వచ్చాయి. ఒక్కొక్క ఇయర్ బరువు 3.75 గ్రాములు ఉంటుంది. కేస్, ఇయర్ బడ్స్ కలిపి 37.4 గ్రాముల బరువు ఉంటాయి. ఐపీ54 వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ తో ఈ బడ్స్ వచ్చాయి. ఏఏసీ, ఎస్బీసీ కొడెక్స్ సపోర్ట్, బ్లూటూత్ 5.3 ఈ బడ్స్ లో ఉన్నాయి. రెండు డివైజెస్ కి ఒకేసారి కనెక్ట్ చేసుకునే ఆప్షన్ యూజర్ కి ఉంటుంది. అలాగే గూగుల్ ఫాస్ట్ పెయిర్ సపోర్ట్ కూడా ఉంటుంది.
OPPO Enco Air 3 TWS బడ్స్.. ఒక్కొక్కటి 27ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటాయి. కేస్ లో 300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. సింగిల్ చార్జ్ పై బడ్స్ 6 గంటల పాటు బ్యాటరీ లైఫ్ ఇస్తాయి. చార్జింగ్ కేస్ తో 25 గంటల పాటు బ్యాటరీ లైఫ్ ఉంటుంది. కేస్, ఇయర్ బడ్స్ కలిపి పూర్తిగా చార్జ్ అయ్యేందుకు 2 గంటల సమయం పడుతుంది. చార్జింగ్ టైప్-సీ కేబుల్ ద్వారా చేయవచ్చు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











