నేడే భారత్‌లో OPPO Reno 8T 5G ఫస్ట్ సేల్

Highlights

  • ఇవాళ సేల్ కి వచ్చిన OPPO Reno 8T 5G స్మార్ట్ ఫోన్
  • 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 10-బిట్ అమోలెడ్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 108ఎంపి కెమెరా ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
  • భారత్ లో OPPO Reno 8T 5G ధర రూ.29,999

OPPO Reno 8T 5G స్మార్ట్ ఫోన్ మిడ్ రేంజ్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ ఈ నెల మొదట్లో భారత్ లో లాంచైంది. ఈ ఫోన్ 5జీ కనెక్టివిటీతో వచ్చింది. నేడు మధ్యాహ్నం 12 గంటల నుంచి OPPO Reno 8T 5G సేల్ మొదలైంది. OPPO Reno 8T 5G డివైజ్ ఒప్పో గ్లో డిజైన్ తో వచ్చింది. బ్యాక్ ప్యానెల్ ఫింగర్ ప్రింట్-ప్రూఫ్ అని కంపెనీ చెబుతోంది. పంచ్-హోల్ కటౌట్, ట్రిపుల్ రియర్ కెమెరాలు, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

OPPO Reno 8T 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్, 108ఎంపి ప్రైమరీ కెమెరా, 4800ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

భారత్ లో OPPO Reno 8T 5G ధర, లభ్యత

OPPO Reno 8T 5G స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.29,999 గా ఉంది. సన్‌రైజ్ గోల్డ్, మిడ్నైట్ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ ద్వారా నేడు మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభమైంది. రిటైల్ ఔట్‌లెట్స్, ఒప్పో ఈ-స్టోర్స్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

కంపెనీ ఎక్స్‌చేంజ్ బోనస్ రూ.3,000, కొటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్‌సీ, యస్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్స్ ద్వారా 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అలాగే నో-కాస్ట్ ఈఎంఐ ద్వారా కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది.

OPPO Reno 8T 5G స్పెసిఫికేషన్స్

OPPO Reno 8T 5G లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కర్వ్డ్ ఎడ్జెస్, 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాన్ 695 చిప్సెట్ వాడారు. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ లో 4800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా, 40ఎక్స్ మైక్రోలెన్స్ ఉంటాయి. ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. OPPO Reno 8T 5G ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.