
స్వదేశీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా గతేడాది Lava Blaze 5G ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసింది. అప్పుడు 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో మాత్రమే అందుబాటులో ఉండేది. తాజాగా ఈ కంపెనీ Lava Blaze 5G 6జిబి వేరియంట్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ర్యామ్ అప్‌గ్రేడ్ మినహా, Lava Blaze 5G అవే స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ని కలిగి ఉంటుంది.
Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, 90 హెర్ట్జ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో వచ్చింది. సరే, ఓసారి Lava Blaze 5G 6జిబి ర్యామ్ యొక్క భారత మార్కెట్ ధర, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
భారత్ లో Lava Blaze 5G 6GB ర్యామ్ ధర
Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ 6జిబి ర్యామ్ వేరియంట్ తాజాగా భారత్ లో లాంచైంది. ఇది 128జిబి స్టోరేజీని కలిగి ఉంటుంది. Lava Blaze 5G 6జిబి ర్యామ్ వేరియంట్ ధరను రూ.11,499 గా నిర్ణయించారు. ఇది ఫస్ట్ సేల్ స్పెషల్ ధర అని గమనించాలి. తర్వాత ఫోన్ ధర రూ.11,999 కి మారిపోతుంది. లావా ఈ-స్టోర్, అమెజాన్ ఇండియా ద్వారా ఫిబ్రవరి 16 నుంచి Lava Blaze 5G 6జిబి ర్యామ్ వేరియంట్ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. ఇకపోతే 4జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ.10,999 గా ఉంది.
Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ గ్లాస్ బ్లూ, గ్లాస్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ ఫ్లాట్ ఫ్రేమ్ ని కలిగి ప్రీమియమ్ లుక్ తో ఉంటుంది. ఫోన్ గ్లాస్ బ్యాక్ డిజైన్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది.
Lava Blaze 5G స్పెసిఫికేషన్స్
Lava Blaze 5G లో 6.5-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ ఉన్నాయి. 4జిబి/6జిబి ర్యామ్ తో పాటు 3జిబి వర్చువల్ ర్యామ్ ని ఈ ఫోన్ లో అందించారు. మెమొరీ కార్డ్ ద్వారా 1టిబి వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. ఈ డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్ ని వాడారు.
Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 2ఎంపి డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఇందులో 8ఎంపి కెమెరా అందించారు.
Lava Blaze 5G డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి. ఈ డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లో ఫోన్ తో పాటు 12 వాట్ డ్యూయల్ పోర్ట్ చార్జర్ ని ప్రొవైడ్ చేస్తున్నారు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











