Snapdragon 7+ Gen 1 చిప్సెట్‌తో లాంచ్ కానున్న Realme GT Neo 5 SE

Highlights

  • AnTuTu సర్టిఫికేషన్ డేటాబేస్ పై కనిపించిన Realme GT Neo 5 SE
  • GT సిరీస్ లో వస్తోన్న తొలి SE ఫోన్ Realme GT Neo 5 SE
  • ఇంకా వెల్లడికాని Realme GT Neo 5 SE స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ

Realme కంపెనీ రీసెంట్ గా చైనాలో Realme GT Neo 5 5G ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ డివైజ్ 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వచ్చింది. ఈ ఫోన్ గ్లోబల్ గా GT 3 5G అనే పేరుతో లాంచ్ కానుందని సమాచారం. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్ కోసం GT 3 5G ని రియల్మీ కంపెనీ టీజ్ చేసింది. ఇదిలా ఉండగా, Realme GT Neo సిరీస్ లో మరొక ఫోన్ అభివృద్ధి దశలో ఉన్నట్లు సమాచారం. కొన్ని వారాల్లో లేదా నెలల్లో ఈ ఫోన్ లాంచ్ కానుంది.

తాజా లీక్ ప్రకారం, రియల్మీ సంస్థ కొత్త SE వేరియంట్ ని లాంచ్ చేయనుందని సమాచారం. ఈ ఫోన్ క్వాల్కమ్ ప్రాసెసర్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ ని ఇంకా గ్లోబల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది. సరే, ఓసారి Realme GT Neo 5 SE యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తదితర వివరాలను గురించి తెలుసుకుందాం పదండి.

త్వరలో లాంచ్ కానున్న Realme GT Neo 5 SE

Realme GT Neo 5 SE స్మార్ట్ ఫోన్ 240 వాట్ మోడల్ కంటే క్రింది స్థాయి మోడల్ గా మార్కెట్ లోకి వస్తోంది. ఇంకా లాంచ్ తేదీ కన్ఫర్మ్ కాలేదు. Realme GT Neo 5 SE డివైజ్ స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 1 చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం. ఈ చిప్సెట్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 కి అప్‌గ్రేడ్ వర్షన్.

Realme GT Neo 5 SE స్మార్ట్ ఫోన్ AnTuTu వెబ్ సైట్ పై కనిపించింది. ఇక స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 1 చిప్సెట్ భారీ స్థాయిలో 1,029,731 పాయింట్లు నమోదు చేసింది. డైమెన్సిటీ 8200 చిప్సెట్ ఈ విషయంలో 8,62,000 పాయింట్లు మాత్రమే నమోదు చేయగలిగింది.

అయితే ఇప్పటి వరకు క్వాల్కమ్ సంస్థ తన రాబోవు చిప్సెట్ Snapdragon 7+ Gen 1 కి సంబంధించి ఎటువంటి అధికార ప్రకటన చేయలేదు. అయితే రూమర్ రాయుళ్ళు మాత్రం వివరాలను రాబట్టగలిగారు. కానీ, త్వరలోనే ఈ కొత్త చిప్సెట్ Snapdragon 7+ Gen 1 కి సంబంధించిన వివరాలు మనకు తెలిసే అవకాశం ఉంది.

Realme GT Neo 5 240W స్పెసిఫికేషన్స్

Realme GT Neo 5 స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ వాడారు. ఈ చిప్ 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. 16జిబి ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ అందించారు. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.

Realme GT Neo 5 లో 6.7-ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ యూహెచ్‌ఎఫ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, 5000000:1 డైనమిక్ కాంట్రాస్ట్ రేషియో ఉన్నాయి. కొత్త తరం ఫ్లాగ్షిప్ లుమినిసెంట్ మెటీరియల్ ని ఈ ఫోన్ లో వాడారు.

Realme GT Neo 5 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ కెమెరా ఉంటుంది. 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. రియల్మీ హైపర్‌షాట్ 2.0, టర్బో ‘రా’ లాస్ లెస్ ఇమేజ్ ఆల్గారిథమ్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Realme GT Neo 5 240W వేరియంట్ లో 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది పూర్తిగా చార్జ్ అవ్వడానికి కేవలం 8 నిమిషాల సమయం తీసుకుంటుంది. ఈ ఫోన్ లో ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, డాల్బి అట్మాస్ డ్యూయల్ స్పీకర్స్, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ ఉన్నాయి. ఇంకా ఆర్జీబీ బ్రీథింగ్ లైట్ బ్యాక్ ప్యానెల్ పై ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleలీకైన OnePlus Nord 3 స్పెసిఫికేషన్స్
Next articleBSNL రూ.397 ప్లాన్: 180 రోజుల వ్యాలిడిటీతో పాటు మరెన్నో బెనిఫిట్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.