ఫిబ్రవరి 21 నుంచి అమెజాన్ ద్వారా ‘వన్‌ప్లస్ 11ఆర్ 5జీ’ ప్రీ-ఆర్డర్స్

Highlights

  • అమెజాన్, వన్‌ప్లస్ స్టోర్ ద్వారా ప్రీ-ఆర్డర్ కి అందుబాటులో ఉండనున్న OnePlus 11R 5G
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి కెమెరాతో వచ్చిన OnePlus 11R 5G
  • భారత్ లో OnePlus 11R 5G 8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.39,999

OnePlus 11R 5G స్మార్ట్ ఫోన్ ఈ నెల ఆరంభంలో OnePlus 11 5G తో సహా లాంచైంది. భారత్ లో OnePlus 11R 5G ప్రీ-ఆర్డర్స్ రేపటి (ఫిబ్రవరి 21) నుంచి మొదలవుతాయని 91mobiles తన కథనంలో పేర్కొంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ యూనిట్, 1.5 కే రెజుల్యూషన్ కర్వ్డ్ డిస్ప్లే ఈ ఫోన్ లో ఉంటాయి.

భారత్ లో వన్‌ప్లస్ 11ఆర్ 5జీ ధర, లభ్యత

OnePlus 11R 5G స్మార్ట్ ఫోన్ 8జిబి + 128జిబి వేరియంట్ ధర రూ.39,999 గా ఉంది. 16జిబి + 256జిబి వేరియంట్ ధర రూ.44,999 గా ఉంది. అమెజాన్ మరియు వన్‌ప్లస్ స్టోర్ ద్వారా రేపటి నుంచి ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్స్ మొదలవుతాయి.

వన్‌ప్లస్ 11ఆర్ 5జీ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

OnePlus 11R 5G స్మార్ట్ ఫోన్ 6.74-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే తో వచ్చింది. స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 16జిబి ర్యామ్ + ర్యామ్ వీటా టెక్నాలజీతో ఈ ఫోన్ వచ్చింది. 120 హెర్ట్జ్ సూపర్ ఫ్లూయిడ్ డిస్ప్లే, 1450 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1000 హెర్ట్జ్ టచ్ రెస్పాన్స్ రేట్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

OnePlus 11R 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 మెయిన్ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఈ ఫోన్ లో ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

OnePlus 11R 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. OnePlus 11R 5G డివైజ్ సోనిక్ బ్లాక్, గెలాక్టిక్ సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. ఎల్పీడీడీఆర్5 ర్యామ్, యూఎఫ్ఎస్4.0 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు. ఈ హ్యాండ్సెట్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

OnePlus 11R 5G లో 5జీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. OnePlus 11R 5G డివైజ్ 163.1 మిల్లీ మీటర్ల పొడవు, 74.1 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.53 మిల్లీ మీటర్ల మందం, 205 గ్రాముల బరువు ఉంటుంది. భద్రత కోసం ఈ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. డాల్బి అట్మాస్, అలర్ట్ స్లైడర్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous article13T సిరీస్ ని లాంచ్ చేసే ఆలోచనలో Xiaomi
Next articleSnapdragon 8 Gen 3 తో లాంచ్ కానున్న Realme GT 3 చైనా వేరియంట్?
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.