120Km రేంజ్ తో లాంచైన Ampere Zeal EX ఎలక్ట్రిక్ స్కూటర్

Highlights

  • భారతీయ మార్కెట్ లో లాంచైన Ampere Zeal EX ఎలక్ట్రిక్ స్కూటర్
  • భారత్ లో Ampere Zeal EX ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.69,900
  • సింగిల్ చార్జ్ పై 120 కిలోమీటర్ల దూరం వెళ్ళనున్న Ampere Zeal EX ఎలక్ట్రిక్ స్కూటర్

భారత మార్కెట్ లో Ampere Zeal EX ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచైంది. తక్కువ ధరకే ఆంపియర్ సంస్థ తన సరికొత్త మోడల్ Zeal EX ని మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ సంస్థ బడ్జెట్ ప్రైస్ లో పలు ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది. తాజాగా స్టైలిష్ గా ఉన్న Ampere Zeal EX స్కూటర్ ని తీసుకొచ్చింది. లుక్ అండ్ ఫినిషింగ్ చూస్తే, ఈ బండి యూత్ ని బాగా ఆకర్షించనుందని అర్థమవుతోంది. ధర తక్కువైన ఎన్నో ఫీచర్లను ఈ స్కూటర్లో అందించడం విశేషం.

భారత్ లో Ampere Zeal EX ధర

సుదీర్ఘ సవారీల విషయానికి వస్తే, Ampere Zeal EX ఉత్తమమైనదని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ బండి సింగిల్ చార్జ్ పై 120 కిలోమీటర్ల దూరం పరిగెడుతుంది. ఈ స్కూటర్ ప్రస్తుతం మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో రూ.69,900 ఎక్స్-షోరూమ్ ధరతో లాంచ్ చేశారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.75,000 గా ఉంటుంది.

అంతే కాదండోయ్, Ampere Zeal EX ఈ-స్కూటర్ కొనుగోలుపై పేరెంట్ కంపెనీ అయిన Greaves Mobility రూ.6,000 ల అదనపు ప్రయోజనాలను అందిస్తోంది. 2023, మార్చి 31 లోపు బండిని కొనుగోలు చేస్తే ఈ ప్రయోజనాలు లభిస్తాయి.

Ampere Zeal EX స్పెసిఫికేషన్స్

Ampere Zeal EX ఎలక్ట్రిక్ స్కూటర్ లో 1.8 కిలోవాట్ పవర్ ని ఉత్పత్తి చేసే మోటర్ ఉంది. ఈ బండి టాప్ స్పీడ్ 50 నుంచి 55 కేఎంపీహెచ్. 60 వోల్ట్స్, 2.3 కిలోవాట్ అవర్ లిథియమ్ బ్యాటరీని ఈ బండిలో అందించారు. సింగిల్ చార్జ్ పై Ampere Zeal EX స్కూటర్ 120 కిలోమీటర్ల దూరం పరిగెడుతుంది.

Ampere Zeal EX బండిలో డ్రమ్ బ్రేక్, ఫ్రంట్ టెలీస్కోపిక్, రియర్ ట్విన్ ట్యూబ్ సస్పెన్షన్ అందించారు. ఈ స్కూటర్ యొక్క మోత సామర్థ్యం 150 కిలోలుగా ఉంది. చార్జర్ విషయానికి వస్తే, ఆంపియర్ సంస్థ ఈ బండితో పాటు 60 వోల్ట్స్, 7.5A Li చార్జర్ ని అందిస్తోంది. బ్యాటరీ పూర్తిగా చార్జ్ అవ్వడానికి 5 గంటల సమయం పడుతుంది.

Ampere Zeal EX బండిపై కంపెనీ 3 ఏళ్ళ వ్యారంటీ, చార్జర్, మోటర్, కంట్రోలర్, కన్వర్టర్ వంటి ప్రయోజనాలను అందిస్తోంది. గత వారం ఆంపియర్ సంస్థ నుంచి Ampere Primus ఎలక్ట్రిక్ స్కూటర్ భారత్ లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఈ Primus ఈ-స్కూటర్ 107 కిలోమీటర్ల రేంజ్, 77కేఎంపీహెచ్ టాప్ స్పీడ్ తో వచ్చింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.10 లక్షలుగా ఉంది. Ampere Primus గురించి ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.