13ఎంపి కెమెరా, 6000ఎంఏహెచ్ బ్యాటరీతో భారత్‌లో లాంచైన Infinix Smart 7

Highlights

  • నేడు భారతీయ మార్కెట్ లో లాంచైన Infinix Smart 7 స్మార్ట్ ఫోన్
  • 13ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి ఫ్రంట్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, టైప్-సీ పోర్ట్ తో వచ్చిన Infinix Smart 7
  • భారత్ లో Infinix Smart 7 ఫోన్ 4జిబి+64జిబి వేరియంట్ ధర రూ.7,299

నేడు భారతీయ మార్కెట్ లో Infinix Smart 7 లాంచైంది. ఈ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ లో యూనిఎస్ఓసీ ఎస్‌సీ9863ఏ1 అనే ప్రాసెసర్ వాడారు. రెడ్మీ ఏ1, పోకో సీ50, టెక్నో పాప్ 7 ప్రో వంటి ఫోన్లతో Infinix Smart 7 పోటీ పడనుంది. Infinix Smart 7 లో భారీ హెచ్డీ+ డిస్ప్లే, 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.

Infinix Smart 7 స్మార్ట్ ఫోన్ లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 13ఎంపి రియర్ కెమెరా, 5ఎంపి ఫ్రంట్ కెమెరా, రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఈ ఫోన్ లో టైప్-సీ పోర్ట్ అందించారు. ఓసారి Infinix Smart 7 ధర, లభ్యత, స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.

భారత్ లో Infinix Smart 7 ధర, లభ్యత

Infinix Smart 7 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.7,299 గా ఉంది. ఈ హ్యాండ్సెట్ ఫిబ్రవరి 27 నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి వస్తోంది.

Infinix Smart 7 స్పెసిఫికేషన్స్

Infinix Smart 7 స్మార్ట్ ఫోన్ లో 6.6-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, వాటర్ డ్రాప్ నాచ్ ఉంటాయి. ఈ డివైజ్ లో యూనిఎస్ఓసీ ఎస్‌సీ9863ఏ1 అనే చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం పవర్‌వీఆర్ జీపీయూ వినియోగించారు. Infinix Smart 7 డివైజ్ లో 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ ఉంటాయి. ఈ ఫోన్ లో 3జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ అందించారు. ఈ హ్యాండ్సెట్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Infinix Smart 7 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి సెకండరీ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరాను అందించారు. ఫ్రంట్ కూడా ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది.

Infinix Smart 7 లో పవర్ బ్యాకప్ కోసం 7000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఈ ఫోన్ లో టైప్-సీ పోర్ట్ అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ లో మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ఉంటుంది. భద్రత కోసం ఈ డివైజ్ లో రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. అలాగే సాఫ్ట్ వేర్ బేస్డ్ ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఉంటుంది.

Infinix Smart 7 స్మార్ట్ ఫోన్ అజూర్ బ్లూ, ఎమరాల్డ్ గ్రీన్, నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. వేవ్ ప్యాటర్న్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ బ్యాక్ ప్యానెల్ తో ఈ ఫోన్ రావడం విశేషం. ఈ ఫోన్ 164.2 మిల్లీ మీటర్ల పొడవు, 75.63 మిల్లీ మీటర్ల వెడల్పు, 9.37 మిల్లీ మీటర్ల మందం, 207 గ్రాముల బరువు ఉంటుంది. డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 4.2, జీపీఎస్, గ్లొనాస్, బైడూ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉంటాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleలీకైన Motorola Razr 2023 రెండర్స్; అదిరిపోయిన లుక్
Next article80 కిలోమీటర్ల రేంజ్, 6 కలర్ ఆప్షన్స్ తో భారత్‌లో లాంచైన Okaya Faast F2F
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.