
చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ రియల్మీ త్వరలో Realme GT 3 240W ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 28 న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఈవెంట్ లో ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఈ ఈవెంట్ స్పెయిన్ లోని బార్సిలోనా లో జరుగుతుంది.
తాజాగా Realme GT 3 240W గీక్ బెంచ్ పై కనిపించింది. లిస్టింగ్ ప్రకారం, Realme GT 3 240W డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ తో వస్తున్నట్లు స్పష్టమైంది. అంతకుముందు Bluetooth Special Interest Group (SIG), National Broadcasting and Telecommunications Commission (NBTC), Tingkat Komponen Dalam Negeri (TKDN), Energy efficiency certificates (EEC) వెబ్సైట్స్ పై RMX3709 మోడల్ నంబర్ తో కనిపించింది.
ఈ ఫోన్ లో 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ మేజర్ హైలైట్ గా నిలిస్తోంది. తొలుత ఈ చార్జింగ్ టెక్నాలజీ Realme GT Neo 5 లో కనిపించింది. 1 శాతం నుంచి 100 శాతానికి చేరుకోవడానికి 10 నిమిషాల సమయం పడుతుందని ఇటీవలె రియల్మీ కంపెనీ షోకేజ్ చేసింది. Realme GT 3 240W పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి.
Geekbench పై కనిపించిన Realme GT 3 240W
RMX3709 మోడల్ నంబర్ తో Realme GT 3 240W డివైజ్ గీక్ బెంచ్ డేటాబేస్ పై కనిపించింది. సింగిల్ కోర్ టెస్ట్ లో ఈ ఫోన్ 1265 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 3885 పాయింట్లు సాధించింది. TARO అనే కోడ్ నేమ్ తో ఉన్న 8 కోర్స్ కలిగిన క్వాల్కమ్ ప్రాసెసర్ లిస్ట్ లో కనిపించింది.
రిపోర్ట్ ప్రకారం ఈ డివైజ్ లో గ్రాఫిక్స్ కోసం Adreno 730 GPU వాడినట్లు తెలుస్తోంది. ఈ ప్రాసెసర్ 3.00 GHz క్లాక్ స్పీడ్ కలిగి ఉంది. చూస్తుంటే ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. Realme GT 3 240W లో 16జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 13 ఉంటాయని అర్థమవుతోంది.
Realme GT 3 240W స్పెసిఫికేషన్స్
Realme GT 3 240W లో 6.74-ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. Snapdragon 8 Gen 1 చిప్సెట్ ఈ ఫోన్ లో వాడినట్లు తెలుస్తోంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ రెండు బ్యాటరీ వేరియంట్స్ లో లభిస్తుంది.
Realme GT 3 240W స్మార్ట్ ఫోన్ 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వేరియంట్ తో పాటు, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వేరియంట్ లో లభిస్తుంది. Realme GT 3 240W ని ల్యాబ్ కండీషన్స్ లో పరీక్షించినప్పుడు 1 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 9 నిమిషాలు పట్టినట్లు కంపెనీ చెబుతోంది. కేవలం 80 సెకన్లలోనే 1 నుంచి 20 శాతం చార్జింగ్ పూర్తవుతుంది.
Mobile World Congress లో Realme GT 3 240W స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతుంది. అదే తేదీన లేదా తర్వాత ఏదొక తేదీన భారత్ లో ఈ ఫోన్ లాంచ్ అవుతుందా లేదా అన్నది ఇంకా తెలియదు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











