
స్టాండర్డ్ మరియు ప్రీమియమ్ యూజర్ల అనుభూతిని మరింత మెరుగుపరిచేందుకకు గూగుల్ సంస్థ కొత్త ఫీచర్లపై పని చేస్తోంది. అందులో భాగంగా నిన్న గూగుల్ 1080p ప్రీమియమ్ ప్లేబ్యాక్ విత్ ఎన్హాన్స్డ్ బైట్రేట్ ని టెస్ట్ చేస్తూ కనిపించింది. దీనిని ప్రత్యేకంగా యూట్యూబ్ ప్రీమియమ్ యూజర్ల కోసం గూగుల్ తీసుకొస్తోంది. తాజాగా గూగుల్ తన గూగుల్ వన్ మెంబర్స్ కోసం Magic Eraser ఫీచర్ తో పాటు ఇతర ఫీచర్లను తీసుకొచ్చింది.
అసలైతే, గూగుల్ సంస్థ Pixel 6 సిరీస్ స్మార్ట్ ఫోన్లతో పాటు Magic Eraser ఫీచర్ ని తీసుకొచ్చింది. ఇది ఎంతోమంది యూజర్లకు గొప్ప వరం లాంటిదని చెప్పాలి. ఫోటోలోని అవసరం లేని ఆబ్జెక్ట్స్ ని ఈ ఫీచర్ తో తీసివేయచ్చు. అయితే తొలుత ఈ ఫీచర్ కేవలం పిక్సెల్ ఫోన్ యూజర్లకే పరిమితమని అనుకున్నారు. కానీ, గూగుల్ వన్ మెంబర్షిప్ ఉన్న ప్రతీ స్మార్ట్ ఫోన్ యూజర్ కి ఈ ఫీచర్ ని వర్తింపజేస్తూ అందరినీ గూగుల్ ఆశ్చర్యపరిచింది.
Google One Members కోసం Magic Eraser, HDR Effect మరెన్నో ఫీచర్లు
గూగుల్ వన్ మెంబర్స్ కోసం మ్యాజిక్ ఎరేజర్, హెచ్డీఆర్ ఎఫెక్ట్స్ ఫర్ వీడియోస్, ఎక్స్క్లూజివ్ కొలేజ్ ఎడిటర్ తదితర ఫీచర్లను తీసుకొచ్చామని గూగుల్ ఒక బ్లాగ్ పోస్ట్ ద్వారా అధికార ప్రకటన చేసింది. ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్లపై గూగుల్ ఫోటోస్ యాప్ వాడే ప్రతీ గూగుల్ వన్ మెంబర్ కి ఈ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ఇమేజెస్, వీడియోలను నిక్షిప్తం చేసుకుని, ఎడిట్ మరియు ఆర్గనైజ్ చేసుకునేందుకు ప్రస్తుతం ఉన్న యాప్స్ లో Google Photos యాప్ ఉత్తమమైనది.
గత కొన్నేళ్ళుగా గూగుల్ సంస్థ తన యూజర్ల అనుభూతిని మెరుగుపరిచేందుకు ఎన్నో ఫీచర్లను అందిస్తూ వస్తోంది. తాజాగా గూగుల్ వన్ మెంబర్స్ కోసం మ్యాజిక్ ఎరేజర్ ఫీచర్ తో పాటు మరెన్నో ఫీచర్లను తీసుకొచ్చింది. దీంతో గూగుల్ వన్ మెంబర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Magic Eraser టూల్ ద్వారా ఫోటో లోని అనవసరమైన ఆబ్జెక్ట్స్ ని తొలగించుకోవచ్చు. దీని వల్లన ఫోటోల్లోని డిస్ట్రాక్షన్స్ ని తీసివేయవచ్చు. సర్కిల్ లేదా బ్రష్ టూల్స్ ని ఉపయోగించి యూజర్లు తమకు అవసరం లేని ఆబ్జెక్ట్ ని రిమూవ్ చేయవచ్చు. ఇలా ఆబ్జెక్ట్స్ ని తొలిగించినప్పటికీ ఫోటో నాణ్యత ఏమీ తగ్గదు. తొలగించిన భాగం నేచురల్ గానే కనిపిస్తుంది.
HDR ఎఫెక్ట్స్ అనేవి ఇమేజెస్ కోసం ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఈ ఫీచర్ తో డార్క్ ఫోర్ గ్రౌండ్స్ మరియు బ్రైట్ బ్యాగ్రౌండ్స్ ని బ్యాలెన్స్ చేసుకునే వీలుంటుంది. ఇప్పుడు గూగుల్ ఈ ఫీచర్ ని వీడియోలకు కూడా తీసుకొచ్చింది. గూగుల్ వన్ మెంబర్స్ కోసం వచ్చిన మరొక ఫీచర్ Collage Editor designs. కొలేజ్ లోని సింగిల్ ఫోటోకి విభిన్నమైన స్టైల్స్ ని అప్లై చేసుకునే అవకాశం యూజర్ కి లభిస్తుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











