త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న iQOO Z7; టీజ్ చేసిన కంపెనీ

Highlights

  • భారత్ లో iQOO Z7 లాంచ్ కానుందని స్పష్టం చేసిన iQOO సంస్థ
  • Z7 లైనప్ లో ఫోన్ ని టీజ్ చేసిన ఐకూ ఇండియా సీఈవో నిపున్ మార్య
  • iQOO Z6 సిరీస్ కి సక్సెసర్ గా వస్తోన్న iQOO Z7 సిరీస్, లైనప్ లో లాంచ్ కానున్న స్టాండర్డ్ మరియు ప్రో వేరియంట్స్

2023 ఆరంభం నుంచి iQOO సంస్థ మాంచి జోష్ మీద ఉంది. ఇప్పటి వరకు ఐకూ నుంచి iQOO 11, iQOO Neo 7 ఫోన్లు భారత్ లో లాంచ్ అయ్యాయి. ఇప్పుడు కంపెనీ మరొక ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. iQOO Z6 సిరీస్ కి సక్సెసర్ గా రానున్న iQOO Z7 సిరీస్ ని ఐకూ సంస్థ సోషల్ మీడియాలో టీజ్ చేసింది.

ఐకూ ఇండియా సీఈవో, నిపుణ్ మార్య iQOO Z7 సిరీస్ లాంచ్ ని ట్విట్టర్ ద్వారా టీజ్ చేశారు. మార్చి నెలలో iQOO Z7 సిరీస్ భారత్ లో లాంచ్ కానుందని సమాచారం. నిపుణ్ షేర్ చేసిన ఇమేజ్ ద్వారా ఫోన్ డిజైన్ ఎలా ఉండనుందో తెలుస్తోంది. iQOO Z7 సిరీస్ ఇండియా లాంచ్ కి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం పదండి.

త్వరలో భారత్ లో లాంచ్ కానున్న iQOO Z7 సిరీస్

iQOO Z7 సిరీస్ త్వరలోనే భారత్ లో లాంచ్ కానుందని ఐకూ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే, iQOO Z7 పూర్తి సిరీస్ ని లాంచ్ చేస్తుందా? లేదా ఒకే డివైజ్ ని లాంచ్ చేస్తుందా అనే విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

ఐకూ ఇండియా సీఈవో నిపుణ్ మార్య iQOO Z7 డివైజ్ డిజైన్ ని రివీల్ చేశారు. ఇమేజ్ లో డివైజ్ ని చూస్తుంటే, ఫోన్ డిజైన్ Vivo T1x ని పోలి ఉన్నట్లు అనిపిస్తోంది. Vivo T1x గతేడాది భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ డివైజ్ వర్టికల్ కెమెరా మాడ్యూల్ ని బ్యాక్ ప్యానెల్ పై కలిగి ఉంటుంది. ఫ్లాష్ తో పాటు ఫోటోగ్రఫీ హై డెఫినిషన్ అని టెక్ట్స్ రాసి ఉంది. అలాగే పక్కనే ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. బాటమ్ లో ఐకూ బ్రాండింగ్ కనిపిస్తోంది.

iQOO Z7 కి సంబంధించిన ఇతర వివరాలు ఇంకా తెలియలేదు. Z సిరీస్ ఎక్స్‌క్లూజివ్ గా అమెజాన్ లో విక్రయించబడుతున్న కారణంగా, త్వరలో రాబోవు iQOO Z7 సిరీస్ కూడా అమెజాన్ ద్వారానే అమ్మకాలు జరుపుకోనుందని భావించవచ్చు.

iQOO Z7 సిరీస్ లో iQOO Z7 5G, iQOO Z7 Pro 5G డివైజెస్ లాంచ్ కానున్నాయని గత నివేదికలు స్పష్టం చేసాయి. iQOO Z7 5G ఫోన్ I2207 అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ప్రో మోడల్ విషయానికి వస్తే, అది I2213 అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ప్రస్తుతానికి iQOO Z7 సిరీస్ కి సంబంధించి తెలిసిన వివరాలు ఇంతే. త్వరలోనే ఐకూ కంపెనీ నుంచి మరిన్ని వివరాలు వచ్చే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleGoogle One Members కోసం Magic Eraser, HDR ఫీచర్లను తీసుకొచ్చిన గూగుల్
Next articleగూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించిన Samsung Galaxy A34 5G
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.