
Redmi సంస్థ వివిధ మార్కెట్స్ లో రెండు కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ కంపెనీ త్వరలోనే గ్లోబల్ మార్కెట్స్ లో Redmi 12C ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ డివైజ్ చైనాలో లాంచ్ అయ్యింది. 2022 డిసెంబర్ 31 న Redmi 12C చైనీస్ మార్కెట్ లోకి వచ్చింది. గ్లోబల్ మార్కెట్స్ లో ఈ నెలలోనే లాంచ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది.
భారత్ లో కూడా Redmi 12C ఎంట్రీ ఇవ్వనుందని ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. Redmi Note 12 4G కూడా భారత్ తో సహా ఇతర మార్కెట్స్ లో లాంచ్ కానుందని ముకుల్ శర్మ తెలిపాడు.
షావోమి సబ్-బ్రాండ్ Redmi నుంచి Redmi Note 12 4G కొత్త బడ్జెట్ శ్రేణి ఫోన్ గా మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. సరే, ఓసారి Redmi 12C, Note 12 4G ఫోన్ల యొక్క లాంచ్, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలను గురించి తెలుసుకుందాం పదండి.
Redmi 12C, Redmi Note 12 4G ఇండియా లాంచ్ వివరాలు
Redmi 12C డివైజ్ చవకైన ఫోన్ గా కంపెనీ నుంచి రానుంది. ఈ నెలలోనే గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ కానుందని తెలుస్తోంది. ముకుల్ శర్మ లాంచ్ టైమ్ లైన్ ని రివీల్ చేయలేదు. ఇప్పటికే చైనాలో ఈ ఫోన్ అందుబాటులో ఉన్నందున త్వరలోనే భారత్ తో పాటు, ఇతర మార్కెట్స్ లో ఈ ఫోన్ అదే హార్డ్‌వేర్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
Redmi 12C ఒక 4జీ స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ లో 6.71-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ హెచ్డీ+ డిస్ప్లే, 1650 x 720 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటాయి. వాటర్ డ్రాప్ నాచ్ లో ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మందపాటి బెజెల్ ని కలిగి ఉంటుంది.
చైనాలో Redmi 12C 128జిబి స్టోరేజీ వేరియంట్ లో లాంచైంది. ఇతర మార్కెట్స్ లో కూడా ఇదే స్టోరేజీతో లాంచ్ కానున్నట్లు సమాచారం. మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ ద్వారా 512జిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు. Redmi 12C లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 0.8 ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. Redmi 12C లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
Redmi 12C లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 10 చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 3.5 ఎంఎం ఆడియో జాక్ ఇందులో ఇచ్చారు. భద్రత కోసం రియర్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. మైక్రో యూఎస్బీ పోర్ట్ ద్వారా చార్జింగ్ చేసుకునే వీలుంది.
Redmi Note 12 4G స్పెసిఫికేషన్స్
Redmi Note 12 4G లో 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హోల్-పంచ్ కటౌట్ ఉన్నాయి. లీకైన స్పెసిఫికేషన్స్ ప్రకారం, ఈ ఫోన్ ఐస్ బ్లూ, ఆనిక్స్ గ్రే, మింట్ గ్రీన్ కలర్ లో లభ్యమవ్వనుంది. Redmi Note 12 4G గ్లోబల్ గా 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో లాంచ్ కానుంది.
Redmi Note 12 4G లో స్నాప్ డ్రాగన్ చిప్సెట్ వాడనున్నారు. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Redmi Note 12 4G లో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనుంది.
Redmi Note 12 4G డివైజ్ ఐపీ53 రేటింగ్, 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో రానుంది. ఈ డివైజ్ 165.66 మిల్లీ మీటర్ల పొడవు, 75.96 మిల్లీ మీటర్ల వెడల్పు, 7.85 మిల్లీ మీటర్ల మందం, 183.5 గ్రాముల బరువు ఉంటుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











