
మార్చి 21 న iQOO Z7 భారత్ లో లాంచ్ కానుందని ఆన్‌లైన్ లో షేర్ అయిన ఒక స్క్రీన్ షాట్ ద్వారా తెలుస్తోంది. గూగుల్ స్క్రీన్ షాట్ ద్వారా అందరూ ఎంతగానో ఎదురు చూస్తోన్న ప్రీమియమ్ మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ భారత్ లో మార్చి 21 న లాంచ్ కానుందని తెలిసింది. గత కొన్ని రోజులుగా iQOO Z7 డివైజ్ చార్జింగ్ స్పీడ్, మోడల్ నంబర్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి తాజాగా లీకైన సమాచారం ఏంటో తెలుసుకుందాం.
మార్చి 21 న లాంచ్ కానున్న iQOO Z7
తాజాగా సమాచారం మనకు ప్రముఖ టిప్‌స్టర్ Oneily Gadget నుంచి వచ్చింది. టిప్‌స్టర్ iQOO Z7 యొక్క గూగుల్ యాడ్ స్క్రీన్ షాట్ షేర్ చేయడంతో లాంచ్ తేదీ వివరాలు బయటకు వచ్చాయి. iQOO Z7 డివైజ్ స్లే, స్ట్రీమ్, షూట్, రిపీట్ అనే ట్యాగ్‌లైన్ తో వచ్చింది. ట్యాగ్ లైన్ తో పాటు లాంచ్ తేదీ మార్చి 21, 2023 అని ఉంది. ఆకర్షణీయమైన ఆఫర్, బ్యాంక్ క్యాష్ బ్యాక్ తో iQOO Z7 స్మార్ట్ ఫోన్ రానుందని యాడ్ స్క్రీన్ షాట్ ద్వారా తెలుస్తోంది.
కొన్ని రోజుల క్రితం iQOO సీఈవో నిపున్ మార్యా AnTuTu బెంచ్ మార్క్ స్కోర్ ని షేర్ చేశారు. iQOO Z7 స్కోర్ 4.8 లక్షలుగా ఉంది. స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ కలిగిన అన్ని ఫోన్స్ కూడా ఈ రేంజ్ లోనే స్కోర్ కలిగి ఉన్నాయి. మార్యా ట్వీట్ ని ఆధారంగా చేసుకుని, iQOO Z7 డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 920 చిప్సెట్ తో రానుందని టిప్‌స్టర్ ముకుల్ శర్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు.
iQOO Z7 డివైజ్ ఆమధ్య 3C సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. లిస్టింగ్ ప్రకారం, ఈ ఫోన్ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రానున్నట్లు అర్థమవుతోంది. కాస్త చవకైన iQOO Z7x ఫోన్ 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ని కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఐకూ జెడ్ 7 లైనప్ లో ఎన్ని డివైజెస్ లాంచ్ కానున్నాయో అఫీషియల్ గా తెలియాల్సి ఉంది.
గత నెలలో iQOO Z7 లాంచ్ ని iQOO సంస్థ టీజ్ చేసింది. ఇక అప్పటి నుంచి రూమర్ రాయుళ్ళు ఈ లైనప్ కి సంబంధించిన సమాచారాన్ని వెలికి తీయడంలో బిజీగా మారిపోయారు. త్వరలోనే ఐకూ సంస్థ నుంచి iQOO Z7 కి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











