
ఇటీవలె పోకో సంస్థ భారత్ లో POCO X5 Pro 5G ఫోన్ ని లాంచ్ చేసింది. తాజాగా ఈ కంపెనీ భారతీయ మార్కెట్ లో POCO X5 5G డివైజ్ ని విడుదల చేసింది. నేడు POCO X5 5G డివైజ్ 7 5జీ బ్యాండ్స్ సపోర్ట్ తో భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. రిలయన్స్ జియో మరియు ఎయిర్టెల్ టెలీకామ్ ఆపరేటర్లకు చెందిన 5జీ సేవలను ఈ ఫోన్ ద్వారా పొందవచ్చు. సరే, ఓసారి POCO X5 5G యొక్క భారత మార్కెట్ ధర, ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
POCO X5 5G ధర
POCO X5 5G స్మార్ట్ ఫోన్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచైంది. బేస్ వేరియంట్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ తో లభిస్తుంది. టాప్ వేరియంట్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీతో లభిస్తుంది. ఈ ఫోన్ లో 5జిబి వర్చువల్ ర్యామ్ టెక్నాలజీ కూడా ఉంది. దీంతో గరిష్టంగా 13జిబి వరకు ర్యామ్ ని వినియోగించుకోవచ్చు. అలాగే మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకునే వీలుంది.
POCO X5 5G డివైజ్ 6జిబి వేరియంట్ ధరను రూ.18,999 గా నిర్ణయించారు. 8జిబి ర్యామ్ యూనిట్ ధర రూ.20,999 గా ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ యూజర్లు ఈ ఫోన్ కొనుగోలుపై రూ.2,000 డిస్కౌంట్ పొందవచ్చు. మార్చి 21 నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా POCO X5 5G సేల్స్ మొదలవుతాయి. జాగ్వార్ బ్లాక్, వైల్డ్‌క్యాట్ బ్లూ, సూపర్‌నోవా గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.
POCO X5 5G స్పెసిఫికేషన్స్
- 6.67-ఇంచ్ 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే
- క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్
- 5జిబి వర్చువల్ ర్యామ్
- 48ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
- 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ
POCO X5 5G స్మార్ట్ ఫోన్ లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే వాడారు. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం గొరిల్లా గ్లాస్ 3 ని అందించారు. 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1200 నిట్స్ బ్రైట్నెస్, 45,00,000:1 కాంట్రాస్ట్ రేషియో వంటి ఫీచర్లు ఈ డిస్ప్లేలో ఉన్నాయి.
POCO X5 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ ని ఈ ఫోన్ లో వాడారు. ఈ చిప్ 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. POCO X5 5G ఫోన్ 7 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది.
POCO X5 5G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
POCO X5 5G స్మార్ట్ ఫోన్ డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, 3.5ఎంఎం ఆడియో జాక్, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంది. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఐపీ53 వాటర్ అండ్ డస్ట్ రేటింగ్ తో వచ్చింది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











