
ఆసుస్ సంస్థ త్వరలో భారత్ లో ASUS ROG Phone 7 ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ASUS ROG Phone 7 డివైజ్ ఏప్రిల్ 13 న లాంచ్ అవుతుందని ఆసుస్ సంస్థ రీసెంట్ గా అఫీషియల్ గా ప్రకటించింది. అయితే, ASUS ROG Phone 7 సిరీస్ లో వచ్చే వర్షన్ ఏంటో తెలపలేదు. కొత్త ROG సిరీస్ లో వచ్చే అవకాశం ఉన్న వర్షన్స్, వాటి ఫీచర్స్ కి సంబంధించిన వివరాలు తాజా లీక్ ద్వారా బయటకు వచ్చాయి. ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ట్విట్టర్ ద్వారా ఈ వివరాలను రివీల్ చేశాడు.
Exclusive ?
Only Asus ROG phone 7 and 7 Ultimate will launch this time no ROG 7 Pro
Specifications
Snapdragon 8 Gen 2
Rear camera 50MP IMX766 + 13MP Ultra wide + 8MP MacroFront camera – 32MP
173 x 77 x 10.3mm thick
Weight 239 gram
Android 13ROG 7 Ultimate
16+512GB#Asus— Abhishek Yadav (@yabhishekhd) March 25, 2023
ASUS ROG Phone 7 సిరీస్ లో రానున్న 2 ఫోన్లు
లీకైన రిపోర్ట్ ప్రకారం, ASUS ROG Phone 7 సిరీస్ లో రెండు డివైజెస్ ఉండనున్నాయి. అవి: ASUS ROG Phone 7 మరియు ASUS ROG Phone 7 Ultimate. రిపోర్ట్ ని బట్టి, ఈసారి ASUS ROG Phone 7 Pro ని ఈసారి స్కిప్ చేయాలని ఆసుస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సరే, ఓసారి ASUS ROG Phone 7 సిరీస్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
ఆసుస్ ఇండియా తన కొత్త ఆర్ఓజీ సిరీస్ ని పరిచయం చేసేందుకు రెడీ అయ్యింది. ASUS ROG Phone 7 సిరీస్ ని ఏప్రిల్ 13 న లాంచ్ చేయనున్నామని కంపెనీ రీసెంట్ గా ప్రకటించింది. తాజాగా వచ్చిన లీక్ ద్వారా ASUS ROG Phone 7 సిరీస్ స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. అవెలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
ASUS ROG Phone 7 స్పెసిఫికేషన్స్ (లీక్డ్)
టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ట్వీట్ ప్రకారం, ASUS ROG Phone 7 సిరీస్ లో రెండు గేమింగ్ ఫోన్లు రానున్నాయి. అవి: ASUS ROG Phone 7 మరియు ASUS ROG Phone 7 Ultimate. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో ఈ ఫోన్లు రానున్నట్లు సమాచారం. ఓవర్ క్లాక్డ్ వర్షన్ కి బదులుగా ఈ చిప్సెట్ 3.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంటుంది.
ASUS ROG Phone 7 సిరీస్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని టిప్ స్టర్ రివీల్ చేశాడు. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్766 ప్రైమరీ సెన్సర్, 13ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 8ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 173 ఎంఎం పొడవు, 77 ఎంఎం వెడల్పు, 10.3 ఎంఎం మందం, 239 గ్రాముల బరువు ఉంటుంది.
ASUS ROG Phone 7 Ultimate డివైజ్ 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీతో రానుంది. 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ కలిగిన మరొక వర్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇకపోతే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
గత రిపోర్ట్స్ ప్రకారం, ASUS ROG Phone 7 సిరీస్ 6.8-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నట్లు సమాచారం. ఇది 65 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు తెలుస్తోంది. ASUS ROG Phone 7 లైనప్ ఏప్రిల్ 13 న లాంచ్ అవుతోంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











