
వివో సంస్థ వై-సిరీస్ లో కొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్ పేరు Vivo Y78+ అయ్యుంటుందని ఒక రూమర్ వినిపిస్తోంది. 2023 ఏప్రిల్ లో Vivo Y78+ డివైజ్ చైనాలో లాంచ్ కానుందని సమాచారం. ఈలోపు Vivo Y78+ డివైజ్ గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజ్ లిస్ట్ లో దర్శనమిచ్చింది. లిస్టింగ్ ద్వారా ఫోన్ యొక్క పేరు మాత్రమే తెలిసింది. అయితే ఈ ఫోన్ త్వరలోనే లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. సరే, ఓసారి Vivo Y78+ గురించి తెలిసిన సమాచారం ఏంటో తెలుసుకుందాం పదండి.
గూగుల్ ప్లే సపోర్ట్ డివైజ్ లిస్ట్ పై కనిపించిన Vivo Y78+
Vivo Y78+ ఫోన్ Vivo V2271A/PD2271 అనే మోడల్ నంబర్ తో గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ లో కనిపించింది. వచ్చే నెలలో ఈ ఫోన్ చైనీస్ మార్కెట్ లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఇక Vivo Y78+ డివైజ్ భారత మార్కెట్ లాంచ్ పై కూడా ఒక రూమర్ వినిపిస్తోంది.
గూగుల్ ప్లే సపోర్ట్ డివైజెస్ లిస్ట్ లో Vivo Y78+ ఫోన్ డిజైన్ మరియు స్పెసిఫికేషన్స్ గురించి ఏమీ తెలియలేదు. గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్టింగ్ తర్వాత ఆ వెనువెంటనే గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వస్తుంది. ఈ లిస్టింగ్ ద్వారా డిజైన్ మరియు ఫీచర్లు రివీల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి, రానున్న రోజుల్లో ఈ డివైజ్ కి సంబంధించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.
దీంతో పాటు Vivo Y78+ డివైజ్ 3సీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. ఈ డివైజ్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ తో వస్తున్నట్లు 3సీ సర్టిఫికేషన్ ద్వారా తెలుస్తోంది. ఇకపోతే ఈ డివైజ్ 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. సాఫ్ట్ వేర్ విషయానికి వస్తే, Vivo Y78+ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పనిచేయనుందని సమాచారం.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











