
Samsung Galaxy S23 FE 5G లాంచ్ కి సంబంధించి గత కొన్ని రోజులుగా రూమర్లు వినిపిస్తున్నాయి. కానీ, ఈ ఫోన్ అసలు వస్తుందా? అని ఎంతో మంది ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే గతేడాది శాంసంగ్ సంస్థ Galaxy S22 FE ని లాంచ్ చేయలేదు. అయితే శాంసంగ్ కొత్త ఫ్యాన్ ఎడిషన్ ని లాంచ్ చేయబోదని తర్వాత కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి.
ఇప్పుడు, ఒక కొత్త రిపోర్ట్ Samsung Galaxy S23 FE 5G యొక్క లాంచ్ టైమ్ లైన్ మరియు స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసింది. సరే, ఓసారి Samsung Galaxy S23 FE 5G స్పెసిఫికేషన్స్ మరియు ఇతర వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Samsung Galaxy S23 FE 5G స్పెసిఫికేషన్స్ (లీక్డ్)
సామ్‌మొబైల్ వెబ్ సైట్ రీసెంట్ గా తన కథనంలో Samsung Galaxy S23 FE 5G లాంచ్ టైమ్ లైన్, స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసింది. ఈ ఏడాది నాల్గో త్రైమాసికంలో Samsung Galaxy S23 FE 5G డివైజ్ ని లాంచ్ చేయాలని శాంసంగ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కానీ, కచ్చితమైన తేదీ గురించి సమాచారం లేదు. 2023 అక్టోబర్ మరియు డిసెంబర్ మధ్యలో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
ఒక రిపోర్ట్ ద్వారా Samsung Galaxy S23 FE 5G డివైజ్ ప్రాసెసర్ గురించి తెలిసింది. దాని ప్రకారం, శాంసంగ్ సంస్థ Samsung Galaxy S23 FE 5G ఫోన్ ని ఎగ్జినోస్ 2200 చిప్సెట్ తో లాంచ్ చేయనుందని తెలుస్తోంది. ఈ చిప్ 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారు కానుంది.
Samsung Galaxy S23 FE 5G కెమెరా విభాగం కూడా అప్‌గ్రేడ్ కానుందని తెలుస్తోంది. Samsung Galaxy S23 FE 5G డివైజ్ 50ఎంపి మెయిన్ కెమెరాతో రానున్నట్లు సమాచారం. ఇదే సెన్సర్ ని ఎస్22, ఎస్23 మోడల్స్ లో కూడా వాడారు. ఈ డివైజ్ 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 12ఎంపి 2ఎక్స్ ఆప్టికల్ జూమ్ టెలీఫోటో లెన్స్ తో వచ్చే అవకాశం ఉంది.
Samsung Galaxy S23 FE 5G స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో రానుందని రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ హ్యాండ్సెట్ 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చే చాన్స్ ఉంది.
Samsung Galaxy S23 FE 5G డివైజ్ గురించి వస్తోన్న స్పెసిఫికేషన్స్, లాంచ్ టైమ్ లైన్ ఫ్యాన్ ఎడిషన్ లవర్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











