స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 2 చిప్, 100 వాట్ చార్జింగ్ తో లాంచైన Realme GT Neo 5 SE

Highlights

  • చైనాలో లాంచ్ అయిన Realme GT Neo 5 SE స్మార్ట్ ఫోన్
  • 64ఎంపి కెమెరా, 5500 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన Realme GT Neo 5 SE
  • Realme GT Neo 5 SE ప్రారంభ ధర ఆర్ఎంబి 1,999

Realme GT Neo 5 SE చైనాలో లాంచ్ అయ్యింది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 2 చిప్సెట్ తో వచ్చిన మొదటి ఫోన్ Realme GT Neo 5 SE. ఈ కొత్త రియల్మీ ఫోన్ పంచ్-హోల్ కటౌట్ లో సెల్ఫీ కెమెరా, భారీ రెక్టాంగ్యులర్ మాడ్యూల్ లో మూడు కెమెరా సెన్సర్స్ తో వచ్చింది. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఈ ఫోన్ ఫ్లాషీ డిజైన్, గ్రేడియంట్ షేడ్ తో వచ్చింది. Realme GT Neo 5 SE 6.74-ఇంచ్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 1టిబి స్టోరేజీ తో వచ్చింది.

Realme GT Neo 5 SE ధర

Realme GT Neo 5 SE డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ధర ఆర్ఎంబి 1,999 (సుమారు 23,900) గా ఉంది. 12జిబి + 256జిబి మోడల్ ధర ఆర్ఎంబి 2199 (సుమారు రూ.26,300) గా ఉంది. 12జిబి + 512జిబి యూనిట్ ధర ఆర్ఎంబి 2299 (సుమారు రూ.27,500) గా ఉంది. 16జిబి + 1టిబి యూనిట్ ధర ఆర్ఎంబి 2799 (సుమారు రూ.33,500) గా ఉంది.

Realme GT Neo 5 SE స్పెసిఫికేషన్స్

  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 2 చిప్
  • 6.74-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే
  • 16జిబి ర్యామ్, 1టిబి స్టోరేజీ
  • 64ఎంపి + 8ఎంపి + 2ఎంపి ట్రిపుల్ కెమెరాస్
  • 16ఎంపి ఫ్రంట్ కెమెరా
  • 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్

Realme GT Neo 5 SE స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 2 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వినియోగించారు. ఈ ఫోన్ లో స్టీరియో స్పీకర్స్, డాల్బి అట్మాస్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి. 5జీ, 4జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకోవచ్చు.

Realme GT Neo 5 SE లో 6.74-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, హెచ్డీఆర్10+, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం, 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్, 2772*1240 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Realme GT Neo 5 SE లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి జీసీ02ఎం మైక్రోస్కోప్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous article5000 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచైన Vivo Y02A
Next article5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.51-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో లాంచైన Vivo Y11 4G
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.