రూ.5,000 తగ్గిన iQOO Neo 6 5G ఫోన్ ధర, ఆఫర్ పరిమితకాలమే!

Highlights

  • iQOO Neo 6 5G ఫోన్ పై రూ.5,000 డిస్కౌంట్
  • ఏప్రిల్ 8 వరకు అందుబాటులో ఆఫర్
  • 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేయనున్న iQOO Neo 6 5G

గతేడాది భారత్ లో iQOO Neo 6 5G డివైజ్ లాంచైంది. రూ.29,999 ధరతో భారత మార్కెట్ లోకి ఈ ఫోన్ ప్రవేశించింది. కంపెనీ తాజాగా ఈ ఫోన్ పై ఆఫర్ ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఫోన్ పై రూ.5,000 డిస్కౌంట్ లభిస్తుంది. అన్ని మెమొరీ వేరియంట్స్ కి ఈ డిస్కౌంట్ చెల్లుబాటు అవుతుంది. ఆఫర్ మాత్రం ఏప్రిల్ 8 వరకు అందుబాటులో ఉంటుంది. సరే, ఇతర వివరాలు ఇక్కడ తెలుసుకుందా పదండి.

iQOO Neo 6 5G డిస్కౌంట్ ఆఫర్

iQOO Neo 6 5G స్మార్ట్ ఫోన్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లభిస్తుంది. బేస్ వేరియంట్ 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ ఆఫర్ చేస్తుంది. టాప్ వేరియంట్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్ లో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ.29,999 మరియు రూ.33,999 గా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోన్ పై రూ.5,000 డిస్కౌంట్ లభిస్తుంది.

డిస్కౌంట్ తర్వాత iQOO Neo 6 5G 8జిబి ర్యామ్ వేరియంట్ రూ.24,999 కి లభిస్తుంది. 12జిబి ర్యామ్ వేరియంట్ రూ.28,999 కి లభిస్తుంది. ఏప్రిల్ 8 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. iQOO Neo 6 5G డివైజ్ అమెజాన్ ఇండియా, ఐకూ ఇండియా వెబ్ సైట్స్ ద్వారా డిస్కౌంట్ పై లభిస్తుంది. ఈ ఫోన్ డార్క్ నోవా, సైబర్ రేజ్ మరియు మావెరిక్ ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

iQOO Neo 6 5G స్పెసిఫికేషన్స్

  • 6.62-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 870 చిప్
  • 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ
  • 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్
  • 4700 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 64ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా

iQOO Neo 6 5G స్మార్ట్ ఫోన్ లో 6.62-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, ఈ4 అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, 1300 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+ ఉన్నాయి.

iQOO Neo 6 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 870 చిప్సెట్ వాడారు. ఇది 3.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కల్గిన చిప్. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 650 జీపీయూ వాడారు. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 4700 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

iQOO Neo 6 5G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

iQOO Neo 6 5G కంటే ఉత్తమమైన ఆప్షన్స్ ఇవే

iQOO Neo 6 5G ఆఫర్ లో భాగంగా రూ.24,999 కే లభిస్తోంది. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో Realme GT Neo 3T 5G, POCO F4 5G ఫోన్లు కూడా ఉత్తమైన ఆప్షన్స్ గా నిలుస్తున్నాయి. Realme GT Neo 3T ధర రూ.24,900 వద్ద ఉంది. మరోవైపు POCO F4 ధర రూ.25,999 గా ఉంది. ఈ మూడు ఫోన్లు కూడా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 870 చిప్సెట్ ని కలిగి ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleరూ.12,000 లోపు ధరలో లభించే ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఫోన్లు
Next articleఏప్రిల్ 12 న భారత్ లో లాంచ్ కానున్న Realme Narzo N55
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.