
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో నేడు భారతీయ మార్కెట్ లో POCO C51 ఫోన్ ని లాంచ్ చేసింది. ఇది సీ-సిరీస్ లో కంపెనీ నుంచి వచ్చిన కొత్త డివైజ్. ఫీచర్ల గురించి మాట్లాడితే, ఈ ఫోన్ లో ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 7జిబి ర్యామ్ (4జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ + 3జిబి వర్చువల్ ర్యామ్) వంటివి ఉన్నాయి. భారత్ లో ఈ డివైజ్ ఫ్లిప్ కార్ట్ ద్వారా అమ్ముడవుతుంది. సరే, ఓసారి POCO C51 వివరాలు తెలుసుకుందాం పదండి.
భారత్ లో POCO C51 ధర, సేల్ తేదీ
- 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ = రూ.8,499
POCO C51 స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ లో లాంచైంది. ఈ ఫోన్ ధర రూ.10,000 లోపు ఉంది. స్పెషల్ ఫస్ట్ డే సేల్ లో భాగంగా, ఈ ఫోన్ ని రూ.7,799 కి కొనుగోలు చేయవచ్చు. POCO C51 అసలు ధర రూ.8,499.
POCO C51 స్పెసిఫికేషన్స్
డిజైన్ మరియు డిస్ప్లే
- 6.52-ఇంచ్ హెచ్డీ+ పంచ్-హోల్ డిస్ప్లే
- 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్
- 720*1600 పిక్సెల్ రెజుల్యూషన్
POCO C51 స్మార్ట్ ఫోన్ రాయల్ బ్లూ మరియు పవర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. బ్యాక్ ప్యానెల్ లెదర్ ఫినిషింగ్ మాదిరి కనిపిస్తోంది. ఇది రియర్ ప్యానెల్ పై స్క్రాచెస్ పడకుండా చూస్తుంది. POCO C51 లో 6.52-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 269 పీపీఐ, 1600*720 పిక్సెల్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.
హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్
- మీడియాటెక్ హీలియో జీ36 చిప్
- ఆండ్రాయిడ్ 13 గో ఓఎస్
- 3జిబి వర్చువల్ ర్యామ్
POCO C51 లో మీడియాటెక్ హీలియో జీ36 చిప్ వాడారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ గో 13 ఎడిషన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీని కలిగి ఉంది. టర్బో ర్యామ్ ఫీచర్ ద్వారా 7జిబి వరకు ర్యామ్ యూజర్ కి లభిస్తుంది.
కెమెరా విభాగం
- 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
- 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
POCO C51 లో సింగిల్ రియర్ కెమెరా ఉంటుంది. రియర్ ప్యానెల్ పై 8ఎంపి మెయిన్ కెమెరా అందించారు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 5ఎంపి కెమెరా ఉంటుంది.
బ్యాటరీ, చార్జింగ్ మరియు కనెక్టివిటీ ఆప్షన్స్
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
- మైక్రో-యూఎస్బీ పోర్ట్
POCO C51 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం మైక్రో-యూఎస్బీ పోర్ట్ ఇచ్చారు. వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, మైక్రో-యూఎస్బీ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. యాక్సలరో మీటర్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











