
తన కస్టమర్ల కోసం వొడాఫోన్ ఐడియా సంస్థ రెండు రీచార్జ్ ప్లాన్స్ ని రివైజ్ చేసింది. రివైజ్ అయిన ప్లాన్స్ ద్వారా యూజర్ కి ఎక్కువ బెనిఫిట్స్ లభిస్తాయి. రూ.129, రూ.298 రీచార్జ్ ప్లాన్స్ ని రివైజ్ చేశారు. రూ.181 విలువజేసే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ని కంపెనీ లాంచ్ చేశాక తాజాగా రూ.129, రూ.298 ప్లాన్స్ ని వీఐ రివైజ్ చేసింది. సరే, ఈ రెండు ప్లాన్స్ లో చోటుచేసుకున్న మార్పులతో పాటు, బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం.
రూ.129 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు
- 4 రోజుల అధిక వ్యాలిడిటీ
- మొత్తం 18 రోజుల వ్యాలిడిటీ
ఈ వొడాఫోన్ ఐడియా ప్లాన్ ద్వారా అధిక డేటా లభిస్తుంది. అపరిమిత కాలింగ్, 200ఎంబి డేటా లభిస్తుంది. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 18 రోజులు. ఇదివరకు ఈ ప్లాన్ వ్యాలిడిటీ 14 రోజులుగా ఉంది. అయితే, ఈ ప్లాన్ లో ఉచిత ఎస్ఎంఎస్ ప్రయోజనం లభించదు. కస్టమర్ లోకల్ ఎస్ఎంఎస్ కి రూ.1, ఎస్టీడీ ఎస్ఎంఎస్ కి రూ.1.50 పైసలు మరియు ఐఎస్‌డీ ఎస్ఎంఎస్ కి రూ.5 చెల్లించాలి. కాల్స్ ఎక్కువగా మాట్లాడే వారికి ఈ ప్లాన్ ఉత్తమమైనది.
వొడాఫోన్ ఐడియా రూ.298 ప్లాన్
- యాప్స్ యాక్సెస్
వొడాఫోన్ ఐడియా రివైజ్ చేసిన రూ.298 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్ కి 50జిబి 4జీ డేటా లభిస్తుంది. దాంతో పాటు వీఐ మూవీస్ మరియు టీవీ, ప్రీమియమ్ మూవీస్, ఒరిజినల్స్, న్యూస్ మరియు లైవ్ టీవీ కి ఉచిత యాక్సెస్ లభిస్తుంది. రూ.298 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చింది. మునుపు ఈ ప్లాన్ లో యాప్స్ కి యాక్సెస్ అయ్యే అవకాశం లేదు.
ఇవేకాకుండా, కంపెనీ రీసెంట్ గా రూ.181 ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్ చేసింది. దీని ద్వారా కస్టమర్ కి 30జిబి డేటా, 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా డెయిలీ 1జిబి డేటా లభిస్తుంది. అయితే, ఈ ప్లాన్ ఎటువంటి ఉచిత కాలింగ్ బెనిఫిట్ ని అందించదు. ఇది బూస్టర్ ప్యాక్ కావున, మీరు ప్రస్తుతం వాడుతోన్న ఎగ్జిస్టింగ్ ప్లాన్ తో పాటు ఈ ప్లాన్ ని వాడుకోవచ్చు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











