
Vivo సంస్థ త్వరలో Vivo S17 సిరీస్ స్మార్ట్ ఫోన్లను చైనాలో లాంచ్ చేయబోతోంది. ఈ లైనప్ లో Vivo S17, Vivo S17e, Vivo S17 Pro ఫోన్లను లాంచ్ కానున్నాయి. ఈ ఫోన్లు వేరే పేరుతో భారత్ లో కూడా లాంచ్ అవుతాయని సమాచారం. ఇప్పటికైతే, Vivo S17e డివైజ్ చైనీస్ 3సీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. దీంతో ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ రివీల్ అయ్యింది. ఇంకా గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ పై కూడా ఈ ఫోన్ కనిపించింది. మోడల్ నంబర్ తో కూడిన డివైజ్ పేరు ఈ లిస్ట్ లో కనిపించింది.
వివిధ సర్టిఫికేషన్స్ ద్వారా ఖరారైన Vivo S17e చార్జింగ్ స్పీడ్, డివైజ్ పేరు
- 3సీ సర్టిఫికేషన్ ప్రకారం, Vivo S17e డివైజ్ V2285A అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- సర్టిఫికేషన్ లిస్టింగ్ డివైజ్ పేరుని కన్ఫర్మ్ చేయలేదు కానీ మోడల్ నంబర్ కనిపిస్తోంది. ఇదే మోడల్ నంబర్ తో గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ పై Vivo S17e కనిపించింది.
- గూగుల్ లిస్టింగ్ ప్రకారం, V2285A మోడల్ నంబర్ Vivo S17e కి చెందినదని స్పష్టంగా తెలుస్తోంది. దీంతో అన్ని అనుమానాలు తీరిపోయినట్లైంది.
- ఇదే మోడల్ నంబర్ ఇదివరకు Vivo S17 Pro కి చెందినదని భావించారు. ఇది కూడా గీక్ బెంచ్ డేటాబేస్ వెబ్ సైట్ పై కనిపించింది.
- గీక్ బెంచ్ లిస్టింగ్ ప్రకారం, Vivo S17e డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్, 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో రానున్నట్లు సమాచారం.
Vivo S17e స్పెసిఫికేషన్స్ (అంచనా)
డిస్ప్లే
Vivo S17e లో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ డిస్ప్లే ఉండే అవకాశం ఉంది.
చిప్సెట్
Vivo S17e స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఆక్టా-కోర్ ప్రాసెసర్ వాడే అవకాశం ఉంది.
ర్యామ్, స్టోరేజీ
Vivo S17e లో కనీసం 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉండే చాన్స్ ఉంది.
ఓఎస్
ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ కస్టమ్ స్కిన్
పై పని చేయనుంది.
బ్యాటరీ, చార్జింగ్
Vivo S17e లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది.
కెమెరా
Vivo S17e లో 50ఎంపి మెయిన్ కెమెరా, 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయని అంచనా.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











