ప్రమోషనల్ పోస్టర్ ద్వారా రివీలైన OPPO Reno 10 సిరీస్ లాంచ్ తేదీ

Highlights

  • OPPO Reno 10 సిరీస్ లో రానున్న 3 మోడల్స్
  • ట్రిపుల్ రియర్ కెమెరా, కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్ప్లేతో రానున్న సిరీస్
  • మే 24 న చైనాలో లాంచ్ కానున్న డివైజ్, పోస్టర్ ద్వారా ఖరారు

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో త్వరలో చైనాలో OPPO Reno 10 సిరీస్ ని లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఈ నెలలోనే మార్కెట్ లోకి ఈ సిరీస్ రానుందని అంచనా వేస్తున్నారు. తాజాగా లాంచ్ వివరాలు నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. చైనా సామాజిక మాధ్యమం అయిన వీబో పైన ఒక యూజర్ OPPO Reno 10 సిరీస్ ప్రమోషనల్ పోస్టర్ ని షేర్ చేశాడు. దీంతో OPPO Reno 10 సిరీస్ చైనాలో మే 24 న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుందని స్పష్టమైంది.

రిపోర్ట్ ద్వారా OPPO Reno 10 సిరీస్ డిజైన్ కూడా రివీల్ అయ్యింది. OPPO Reno 10 సిరీస్ పిల్-షేప్డ్ కటౌట్ తో రానుంది. అలాగే ఈ సిరీస్ రెండు కలర్ ఆప్షన్స్ లో లభ్యం కానుందని తెలుస్తోంది. OPPO Reno 10 సిరీస్ లాంచ్, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ మరియు ఇతర వివరాలు తెలుసుకుందాం పదండి.

కొన్ని రోజుల్లో లాంచ్ కానున్న OPPO Reno 10 సిరీస్

OPPO Reno 10 సిరీస్ లాంచ్ ఈవెంట్ రానున్న రోజుల్లో జరగనుంది. మే 24 న చైనాలో OPPO Reno 10 సిరీస్ లాంచ్ కానుంది. పర్పుల్ మరియు గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో OPPO Reno 10 సిరీస్ లభించనుంది. కర్వ్డ్ రియర్ ప్యానెల్ పై డ్యూయల్-టోన్ పిల్-షేప్డ్ కెమెరా మాడ్యూల్ కనిపిస్తోంది.

OPPO Reno 10 సిరీస్ డివైజెస్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ని కలిగి ఉన్నాయి. కెమెరా మాడ్యూల్ పైన ఉన్న టెక్స్ట్ ని బట్టి, OPPO Reno 10 సిరీస్ ఫోన్లు ఒప్పో యొక్క మారిసిలికాన్ ఎన్‌పీయూ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

రీసెంట్ గా OPPO Reno 10 Pro డిజైన్ వివరాలు బయటకు వచ్చాయి. చూడటానికి OPPO Reno 10 Pro+ మాదిరి డిజైన్ ని OPPO Reno 10 Pro కలిగి ఉంది. OPPO Reno 10 సిరీస్ లో వస్తోన్న మూడు ఫోన్లు కూడా బీఐఎస్ సర్టిఫికేషన్ క్లియర్ చేసాయి. దీంతో త్వరలోనే ఈ ఫోన్లు భారత్ లో లాంచ్ కానున్నాయని తెలిసింది.

గీక్ బెంచ్ ద్వారా రివీలైన OPPO Reno 10 Pro+ స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

  • 6.7-ఇంచ్ అమోలెడ్
  • కర్వ్డ్ స్క్రీన్

OPPO Reno 10 Pro+ స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, హోల్-పంచ్ కటౌట్ ఉండనున్నాయి.

ప్రాసెసర్

  • స్నాప్ డ్రాగన్ 778జి
  • డైమెన్సిటీ 8200
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1

OPPO Reno 10 Pro స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ తో రానుంది. OPPO Reno 10 Pro+ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ తో వస్తోంది. ఇక స్టాండర్డ్ మోడల్ స్నాప్ డ్రాగ్న 778జి చిప్సెట్ తో రానున్నట్లు సమాచారం.

స్టోరేజీ, ఓఎస్

  • 16జిబి ర్యామ్
  • 512జిబి స్టోరేజీ
  • ఆండ్రాయిడ్ 13

OPPO Reno 10 Pro+ డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి స్టోరేజీని కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా విభాగం

  • 50ఎంపి సోని ఐఎంఎక్స్890
  • 64ఎంపి పెరిస్కోప్ లెన్స్

OPPO Reno 10 Pro డివైజ్ లో 50ఎంపి ఓఐఎస్ సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమెరా, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ కెమెరా ఉండనున్నాయి. ఈ ఫోన్ లో 2ఎక్స్ ఆప్టికల్ జూమ్ గల పొట్రెయిట్ లెన్స్ కూడా ఉండనుంది. OPPO Reno 10 Pro+ డివైజ్ 64ఎంపి పెరిస్కోప్ లెన్స్ తో రానున్నట్లు సమాచారం.

స్టాండర్డ్ మోడల్ అయిన OPPO Reno 10 లో స్నాప్ డ్రాగన్ 778జి చిప్సెట్ ఉండనుందని తెలుస్తోంది. ఇకపోతే ఈ ఫోన్ ఎఫ్‌సీసీ వెబ్ సైట్ పై కనిపించడంతో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, సూపర్‌వూక్ చార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ బరువు 185 గ్రాములు.