గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించిన Vivo Y78m; ఏయే ఫీచర్లు ఉన్నాయో తెలుసుకోండి!

Highlights

  • పీడీ2278 అనే మోడల్ నంబర్ తో లిస్ట్‌ ఐన Vivo Y78m
  • 12జిబి ర్యామ్ తో లాంచ్ కానుందని సమాచారం
  • డైమెన్సిటీ 7020 చిప్‌తో రానున్న డివైజ్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో త్వరలోనే ఒక కొత్త వై-సిరీస్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. తాజాగా Vivo Y78m డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై కనిపించింది. దీంతో స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ రివీల్ అయ్యాయి. 12జిబి ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. సరే, పదండి, ఓసారి Vivo Y78m గురించి మాకు తెలిసిన సమాచారం మీకు చెప్తాం.

Vivo Y78m గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలు

గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ద్వారా వివో వై78ఎమ్ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఈ డివైజ్ పీడీ2278 మోడల్ నంబర్ తో లిస్టింగ్ పై కనిపించింది. పుల్ హెచ్డీ+ డిస్ప్లే, పంచ్-హోల్ కటౌట్, డైమెన్సిటీ 7020 చిప్, 12జిబి ర్యామ్, ఆండ్రాియడ్ 13 ఓఎస్ తో ఈ ఫోన్ రానున్నట్లు సమాచారం.

  • పీడీ2278 మోడల్ నంబర్ తో గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించిన Vivo Y78m
  • ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ తో రానున్న డివైజ్
  • పంచ్ హోల్ కటౌట్ డిజైన్ తో వస్తోన్న ఫోన్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్‌ తో రానున్న Vivo Y78m
  • 12జిబి ర్యామ్ తో గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించిన డివైజ్
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 పై పని చేయనున్న Vivo Y78m

Vivo Y78m స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే

  • 6.4-ఇంచ్ డిస్ప్లే

గూగుల్ ప్లే లిస్టింగ్ ప్రకారం, Vivo Y78m లో 6.4-ఇంచ్ డిస్ప్లే ఉంటుందని తెలుస్తోంది. రిఫ్రెష్ రేట్, టచ్ శాంప్లింగ్ రేట్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

కెమెరా విభాగం

  • 50ఎంపి మెయిన్ కెమెరా
  • 2ఎంపి సెకండరీ కెమెరా

Vivo Y78m స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ కెమెరా ఉంటాయి. సెల్ఫీ కెమెరా గురించి ఇంకా వివరాలు తెలియలేదు. త్వరలోనే ఫ్రంట్ కెమెరా సెన్సర్ వివరాలు తెలిసే అవకాశం ఉంది.

బ్యాటరీ

  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్

Vivo Y78m స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.