4700mAh బ్యాటరీతో జులైలో లాంచ్ కానున్న Nothing Phone (2), ఖరారు చేసిన కార్ల్ పెయి!

Highlights

  • Nothing Phone (2) లాంచ్ టైమ్‌లైన్‌ని కన్ఫర్మ్ చేసిన కార్ల్ పెయి
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్‌తో రానున్న Nothing Phone (2)
  • 12జిబి ర్యామ్ Nothing Phone (2) లో ఉండే అవకాశం

Nothing Phone (2) లాంచ్ ని కొంతకాలం క్రితమే అనుకున్నారు. తాజాగా నతింగ్ సంస్థ సీఈవో కార్ల్ పెయి, లేటెస్ట్ ఇంటర్వ్యూలో Nothing Phone (2) లాంచ్ టైమ్‌లైన్ ని కన్ఫర్మ్ చేశారు. అంతేకాదు, ఆయన Nothing Phone (2) డివైజ్ బ్యాటరీ ఫీచర్స్ ని కూడా వెల్లడించారు. సరే, Nothing Phone (2) కి సంబంధించిన విశేషాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

Nothing Phone (2) లాంచ్ టైమ్‌లైన్, బ్యాటరీ వివరాలు

  • జులై నెల
  • 4700 ఎంఏహెచ్ బ్యాటరీ

నతింగ్ సీఈవో కార్ట్ పెయ్ ఫోర్బ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫోన్ కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను షేర్ చేశారు. ఇంటర్వ్యూ సందర్భంగా కార్ల్ మాట్లాడుతూ, Nothing Phone (2) జూలై లో లాంచ్ అవుతుందని తెలిపారు. అలాగే ఈ ఫోన్ 4700 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్నట్లు చెప్పారు.

Nothing Phone (2) లభ్యత వివరాలు

Nothing Phone (2) తొలుత యూఎస్ తో పాటు గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ కానున్నట్లు కార్ల్ తెలిపారు. గతేడాది Nothing Phone (1) ముందుగా గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. కొన్ని నెలల వరకు కూడా యూఎస్ మార్కెట్ లోకి అందుబాటులోకి రాలేదు.

Nothing Phone (2) స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే

  • 6.55-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ లో 6.55-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండనున్నాయి.

కెమెరా విభాగం

  • 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా

Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా ఉండే అవకాశం ఉంది. ఇతర కెమెరా సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ర్యామ్, స్టోరేజీ

  • 8జిబి + 128జిబి
  • 8జిబి + 256జిబి

Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 12జిబి + 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనుంది.

Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ ఇప్పటికే బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) సర్టిఫికేషన్ ని క్లియర్ చేసింది. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో నథింగ్ సంస్థ సీఈవో కార్ల్ పెయి తమ అప్‌కమింగ్ ఫోన్ లాంచ్ జులైలో ఉంటుందని తెలపడంతో, నథింగ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నథింగ్ లవర్స్ సంస్థ నుంచి రాబోవు రెండో ఫోన్ ని సొంతం చేసుకునేందుకు వేచి చూస్తున్నారు.

కొత్తగా విపణిలోకి అడుగుపెట్టిన నథింగ్ సంస్థ చాలా తక్కువ సమయంలోనే మార్కెట్ లో మంచి స్థానం సంపాదించింది. ప్రత్యేకించి అభిమానుల్లో నథింగ్ పట్ల విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇప్పటి వరకు నథింగ్ సంస్థ నుంచి కేవలం ఒక ఫోన్ మాత్రమే లాంచ్ అయ్యింది. కేవలం ఒక్క ఫోన్ ని లాంచ్ చేసి ఇంత స్థాయిలో పేరు సంపాదించడం కేవలం నథింగ్ కే సాధ్యమైందని చెప్పవచ్చు.