
వొడాఫోన్ ఐడియా సంస్థ కొత్తగా 3 రీచార్జ్ ప్లాన్స్ ని తన కస్టమర్ల కోసం తీసుకొచ్చింది. కంపెనీ రూ.17, రూ.57, రూ.1,999 ప్లాన్స్ ని పరిచయం చేసింది. ఈ ప్లాన్స్ ద్వారా యూజర్లకు అపరిమిత నైట్ డేటా, కాలింగ్ మరియు సుదీర్ఘ వ్యాలిడిటీ లభించనుంది. వొడాఫోన్ ఐడియా కంపెనీ ఈ ప్లాన్స్ ని తన వెబ్ సైట్ లో లిస్ట్ చేసింది. సరే, ఈ ప్లాన్స్ ద్వారా లభించే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం పదండి.
Vi రూ.17 మరియు రూ.57 ప్రీపెయిడ్ ప్లాన్స్
వీఐ రూ.17 ప్లాన్:
- వొడాఫోన్ ఐడియా తీసుకొచ్చిన రూ.17 ప్లాన్ ద్వారా మొత్తం 24 గంటల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంకా రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల దాకా అపరిమిత డేటా ప్రయోజనం పొందవచ్చు.
- అయితే ఈ ప్లాన్ ద్వారా ఎస్ఎంఎస్ మరియు సర్వీస్ వ్యాలిడిటీ లభించవు.
వీఐ రూ.57 ప్లాన్
- రూ.57 ప్లాన్ ద్వారా 7 రోజులు వ్యాలిడిటీ లభిస్తుంది.
- ఇంకా ఈ ప్లాన్ ద్వారా నైట్ డేటా అపరిమితంగా లభిస్తుంది. కానీ, ఈ ప్లాన్ తో సర్వీస్ వ్యాలిడిటీ మరియు ఔట్ గోయింగ్ ఎస్ఎంఎస్ లభించవు.
వొడాఫోన్ ఐడియా రూ.1,999 ప్లాన్
- వొడాఫోన్ ఐడియా సంస్థ తీసుకొచ్చిన రూ.1999 ప్లాన్ ద్వారా 250 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
- ఈ ప్లాన్ ద్వారా అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ మరియు డెయిలీ 1.5జిబి డేటా లభిస్తాయి.
- 100 ఎస్ఎంఎస్ లిమిట్ ముగిశాక, యూజర్లకు ఒక లోకల్ మెసేజ్ కి రూ.1, ఎస్టీడీ మెసేజ్ కి రూ.1.50 పైసలు ఖర్చవుతుంది.
దీంతో పాటు, కంపెనీ రీసెంట్ గా లాంచ్ చేసిన రూ.549 ప్లాన్ ని వెబ్ సైట్ నుంచి తొలగించింది. ఈ ప్లాన్ ద్వారా యూజర్ కి 180 రోజుల వ్యాలిడిటీ, 1జిబి డేటా లభిస్తుంది. అంతేకాదు, రూ.549 టాక్ టైమ్ కూడా లభిస్తుంది. ఈ టాక్ టైమ్ ద్వారా కస్టమర్లు సెకనుకి 2.5 పైసలు వెచ్చించి కాల్స్ చేసుకోవచ్చు.











