
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు వివో తన ఫ్యాన్స్ కోసం గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. Vivo Y16 స్మార్ట్ ఫోన్ పై తగ్గింపు ధరను ప్రకటించింది. వివో ఫోన్ కొనాలని భావించే వారికి ఇది శుభవార్తేనని చెప్పాలి. మరి, వివో ప్రకటించిన తగ్గింపు ధర వివరాలు, ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Vivo Y16 పై ప్రైస్ కట్
వివో సంస్థ Vivo Y16 స్మార్ట్ ఫోన్ పై రూ.500 డిస్కౌంట్ ప్రకటించింది. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ పై ఈ ప్రైస్ కట్ వర్తిస్తుంది. గతంలో ఈ ఫోన్ ధర రూ.12,499 గా ఉంది. తాజా మార్పుతో ఈ ఫోన్ ధర రూ.11,999 కి చేరింది. ఈ ప్రైస్ కట్ కేవలం రిటైల్ స్టోర్స్ లో మాత్రమే వర్తిస్తుంది. Vivo Y16 ఫోన్ ని తగ్గింపు ధరకి ఆఫ్‌లైన్ షాపుల్లో కొనుగోలు చేయవచ్చు.
Vivo Y16 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే
- 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే
Vivo Y16 స్మార్ట్ ఫోన్ లో 6.51-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్ ఉన్నాయి.
చిప్సెట్
- మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్
ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్ వడారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
కెమెరా విభాగం
- డ్యూయల్ రియర్ కెమెరా
Vivo Y16 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5 ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
బ్యాటరీ, చార్జింగ్
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
- 10 వాట్ చార్జింగ్
పవర్ బ్యాకప్ కోసం ఈ స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ
- 4జీ
- డ్యూయల్ సిమ్
ఈ స్మార్ట్ ఫోన్ లో 4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.











